దుబాయ్: గత కొంతకాలంగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకు భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ అండగా నిలిచారు. ఇంగ్లండ్ సిరీస్లో కోహ్లీ మరింత బలంగా పుంజుకుంటాడని అజర్ అభిప్రాయపడ్డాడు. ”విరాట్ కోహ్లీ 50కి పైగా పరుగులు చేసినా అతడు విఫలమైనట్లు భావిస్తున్నారు. వాస్తవానికి ఈ ఏడాది కోహ్లీ పెద్దగా ఆడలేదు. ఎటువంటి స్టార్ ఆటగాళ్లు అయినా ఏదో ఒక దశలో ఇటువంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటారు. కోహ్లీ కూడా అంతే. అతడు కొంతకాలంగా విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. అయితే అతడికి ఇప్పు కాస్త విశ్రాంతి లభించింది. కాబట్టి ఇంగ్లండ్ సిరీస్లో కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి వస్తాడని ఆశిస్తున్నా. కోహ్లీ ఒక సెంచరీ సాధిస్తే… అతడిలో ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపు అవుతుంది” అని మహ్మద్ అజారుద్దీన్ పేర్కొన్నాడు.
కోహ్లీ గత కొంతకాలంగా పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఐపీఎల్‌లోనూ కోహ్లీ అంతగా రాణించలేకపోయాడు. ఈ ఏడాది సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన విరాట్ 341 పరుగులు మాత్రమే సాధించాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న కోహ్లీ… ఇంగ్లండ్‌తో జరుగనున్న ఏకైక టెస్టుకు తిరిగి జట్టులో చేరనున్నాడు. ఈ క్రమంలో విరాట్‌ఫామ్‌పై అజారుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..