టీమ్ ఇండియా స్టార్ క్రికెట్ ప్లేయర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (ఐసీసీ) 2023 పురుషుల వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. ఇదే విషయాన్ని ఐసీసీ ఇవ్వాల (గురువారం) ప్రకటించింది. కాగా, కోహ్లి ఈ ఘనత సాధించడం ఇది (2012, 2017, 2018, 2023) నాలుగోసారి. 2023లో కోహ్లీ తన అద్భుతమైన ఆటతీరుతో క్రికెట్ ప్రేమికులను, తన అభిమానులను ఆకట్టుకున్నాడు. అంతే కాకుండా అత్యధిక వన్డే సెంచరీలు (49) చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు.
వన్డే ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన కోహ్లి 95.62 సగటుతో 765 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. ఇక, 12 నెలల వ్యవధిలో 1377 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. 27 క్యాచ్‌లు, ఒక వికెట్ తీశాడు. ఈ అవార్డు సందర్భంగా విరాట్ కోహ్లీకి క్రికెట్ సెలబ్రిటీలు, సహచరులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.