దేశవ్యాప్తంగా కరోనాతో అతలాకుతలం అవుతుంటే.. మరికొందరు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్, వీకెండ్ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ లాంటివి పెడుతున్నారు. అలాంటి రాష్ట్రాల్లో బయటకు వస్తే.. పోలీసులు ఏ రేంజ్ లో కోటింగ్ ఇస్తున్నారో చూస్తున్నాం. అయితే ఇప్పటి వరకు ఎక్కువగా అబ్బాయిలకు మాత్రమే పనిష్మెంట్ ఇచ్చిన వీడియోలు, ఫొటోలు చూశాం. కానీ మొదటి సారి పోలీసులు కొందరు అమ్మాయిలకు గట్టి కోటింగ్ ఇచ్చారు. ఇంతకీ అదెక్కడ అంటారా అయితే ముందుకు పదండి.
మధ్యప్రదేశ్‌లోని చందేరీ జిల్లాలో ప్రస్తుతం కర్ఫ్యూ రూల్స్ అమలవుతున్నాయి. అత్యవసరం అయితే తప్ప ఎవరినీ బయటకు రానివ్వట్లేదు పోలీసులు. కానీ కొందరు అమ్మాయిలు తమకు మాత్రం ఎలాంటి రూల్స్ వర్తించవన్నట్టు బయటకు వచ్చారు. వాళ్లు చెప్పిన రీజన్ పోలీసులకు అంత ఇంపార్టెంట్ అనిపించలేదు. అంతే ఇక వారందరితో గుంజీలు తీయించారు. చట్టం ముందు అంతా సమానమే అనే రూల్స్ ను ఇక్కడ అమలు చేశారు. జనరల్ అబ్బాయిలకే పోలీసులు కోటింగ్ ఇస్తుంటారు. కానీ మొదటిసారి ఇక్కడ అమ్మాయిలక కూడా పనిష్మెంట్ ఇవ్వడంతో.. అబ్బాయిలు తెగ మురిసిపోతున్నారు. అందరికీ సమానమైన పనిష్మెంట్ వేస్తున్నారు పోలీసులు అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.