ప్రజలు ఎన్నిచెప్పినా మారడం లేదు. కరోనాతో ఒకవైపు ప్రాణాలు పోతున్నా వారిలో మార్పు రావడం లేదు. ఎవరు ఎన్ని చెప్పినా మాకేటి సిగ్గు అన్న విధంగా ప్రవర్తిస్తున్నారు. మంగళవారం నాడు తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటన చేయగానే మందుబాబులు వైన్ షాపుల ముందు ఎగబడ్డారు. హైదరాబాద్ నగరంలోనే కాదు… తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ షాపులో అయితే 3 గంటల్లో రూ.3.5 కోట్ల మద్యం సరుకు ఖాళీ అయ్యింది. అంటే ఏ రేంజ్‌లో మందుబాబులు మద్యం కొనుగోలు చేశారో అర్థం చేసుకోవచ్చు. దీంతో మందుబాబుల న్యూస్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. మరోవైపు మద్యం కోసం కొనేవాళ్లు ఎగబడుతున్నా అమ్మేవాళ్లు మాత్రం కరోనా పట్ల భయపడ్డారు. దయచేసి సామాజిక దూరం పాటిస్తేనే తాము మద్యం అమ్మకాలు జరుపుతామంటూ ఎనౌన్స్‌మెంట్లు ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement