రాజస్థాన్‌లోని జైపూర్‌లో పట్టపగలే డాక్టర్ దంపతులను హత్య చేసిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. భరత్పూర్ జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లోని సెంట్రల్ బస్టాండ్ సర్కిల్ వద్ద బైకుపై వచ్చిన ఇద్దరు నిందితులు ఓ కారును అడ్డగించారు. ఆ కారులోని దంపతులపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కారులోని జంట అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు డాక్టర్లు అని.. వారిని సుదీప్ గుప్తా, సీమా గుప్తాలుగా పోలీసులు గుర్తించారు.
అయితే ఈ హత్యలను ప్రతీకార హత్యలుగా రాజస్థాన్ పోలీసులు భావిస్తున్నారు. బైక్‌పై వచ్చిన నిందితులు అనూజ్, మహేష్ అని వారి విచారణలో తేలింది. వారి వివరాల ప్రకారం.. డాక్టర్ సుదీప్‌కు గతంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. కొన్నేళ్లు గడిచిన తర్వాత ఆ మహిళ, ఆమె ఐదేళ్ల బిడ్డ ఉన్న ఇంటికి నిప్పంటుకుని ప్రమాదవశాత్తూ వారు చనిపోయారు. అయితే అది ప్రమాదం కాదని, సుదీప్ కుటుంబమే ఆ దాష్టీకానికి పాల్పడిందని కేసు నమోదైంది. దీంతో 2019లో సుదీప్, అతడి తల్లి, భార్య సీమా జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలయ్యారు. ఈ కేసులో బాధితురాలి సోదరుడే ఇప్పుడు నిందితుల్లో ఒకడైన అనుజ్ అని పోలీసులు తెలిపారు. దీంతో ప్రతీకారంగానే అనూజ్ మరో వ్యక్తితో కలిసి హత్యలకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కాగా ఈ హత్యలకు సంబంధించిన వీడియోను బీజేపీ నేత రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్ తన ట్విట్టర్లో పోస్ట్ చేసి.. కాంగ్రెస్ పాలనలో నేరగాళ్లు విజృంభిస్తున్నారని ఆక్షేపించారు.