Saturday, November 23, 2024

వైరల్ న్యూస్: హైదరాబాద్ నగరం కాదు.. రాష్ట్రం

తెలంగాణ రాష్ట్రం అని ఉండాల్సిన చోట హైదరాబాద్ రాష్ట్రం అంటూ టీఆర్‌‌ఎస్ పార్టీ ఫ్లెక్సీలు వేసింది. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఛైర్మన్‌గా నియమితులైన బాజిరెడ్డి గోవర్ధన్‌ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానంగా టీఆర్‌‌ఎస్ భవన్‌తో పాటు సిటీలోని పలు చోట్ల భారీ హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు.

అయితే ఈ ఫ్లెక్సీలలో ‘హైదరాబాద్‌ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఇదే ఆహ్వానం భవదీయుడు బాజిరెడ్డి గోవర్ధన్’ అంటూ రాసి ఉంది. దీంతో టీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement