తెలంగాణలో పీజీ చేసిన ఓ యువకుడు ఉద్యోగం కోసం ఎదురుచూసీ.. చూసీ అలసిపోయాడు. దీంతో చేసేదేమీ లేక మిర్చి బండి పెట్టుకున్నాడు. కరీంనగర్‌కు చెందిన ఆర్.నరసింహ అనే వ్యక్తి మకరంపురలోని దంగన్వాడీ స్కూల్ సమీపంలో మిర్చి వ్యాపారం ప్రారంభించాడు. ప్రతిరోజూ సా.4 గంటల నుంచి రాత్రి 11 వరకు వ్యాపారం చేస్తూ.. తనతో పాటు మరో నలుగురు యువకులకు ఉపాధి కల్పిస్తూ, వారికి రోజుకు రూ.400-500 అందిస్తున్నాడు. ఈ బండికి తెలంగాణ నిరుద్యోగి మిర్చి బండి అనే పేరు పెట్టాడు. ప్రారంభంలో 10 ప్లేట్లు అమ్మకం కాగా మిర్చీల వ్యాపారం రోజువారీగా వృద్ధి చెంది ప్రస్తుతం 400 నుంచి 500 ప్లేట్ల అమ్మకానికి చేరింది.
కాగా ఎన్నో ఆకాంక్షలతో డిగ్రీలు , పీజీలు పూర్తి చేసిన ఎంతో మంది యువతీ , యువకులు ఉద్యోగ వేటలో అలసిపోతున్నారు. చివరకు జీవితాలపై విరక్తి చెంది కొందరు ఆత్మహత్యల వైపు అడుగులు వేస్తున్నారు. అలాంటి వారికి కరీంనగర్ చెందిన ఆర్.నరసింహ అనే యువకుడు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
ఈ వార్త కూడా చదవండి: గుంటూరు: సీతానగరం రేప్ కేసు నిందితుడి అరెస్ట్