ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ టెస్టు సిరీస్‌లో రెండో మ్యాచ్ జరుగుతుండగా.. జస్ట్ స్టాప్ ఆయిల్ ప్రొటెస్టర్స్ పిచ్‌పై దాడి చేశారు. ఇంగ్లండ్‌లోని జస్ట్ స్టాప్ ఆయిల్ ప్రొటెస్టర్స్ అనే పర్యావరణ సంస్థ ప్రతినిధులు ఇద్దరు వ్యక్తులు నిరసన వ్యక్తం చేశారు. వారు పిచ్ లోకి ప్రవేశించి ఆటగాళ్ల జెర్సీలపై నారింజ రంగును పూశారు. దీంతో మ్యాచ్‌ను ఆరు నిమిషాల పాటు నిలిపివేయాల్సివచ్చింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో తొలి ఓవర్ ముగిసిన తర్వాత ఈ ఘటన జరిగింది.
ఇంగ్లండ్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్ రెండో ఓవర్ వేయడానికి సిద్ధమవుతుండగా, ఇద్దరు వ్యక్తులు ఆరెంజ్ పౌడర్ విసిరి ఆటగాళ్ల వైపు దూసుకొచ్చారు. ఒకరిని బెన్ స్టోక్స్, డేవిడ్ వార్నర్ ఆపారు. మరో నిరసనకారుడిని.. వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టో అడ్డుకున్నాడు. బెయిర్‌స్టో తన భుజంపై మోసుకుని గ్రౌండ్ వెలుపలికి తీసుకువెళ్లాడు. అనంతరం భద్రతా సిబ్బంది అతడిని తీసుకెళ్లారు. కాగా, బెయిర్‌స్టో నిరసనకారుడిని తీసుకెళ్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ అనే సంస్థ క్రీడా కార్యక్రమంలో నిరసన వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు ప్రీమియర్ లీగ్ మ్యాచ్, ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ సందర్భంగా వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఏడాది యాషెస్ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పేసర్ మిచెల్ స్టార్క్‌ను చేర్చుకోవడంతో ఆసీస్ రెండో టెస్టులో అడుగుపెట్టింది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్‌కు రెండో టెస్టు కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1తో చేజిక్కించుకోవాలని ఇంగ్లండ్ ప్రయత్నిస్తోంది.