Monday, November 18, 2024

Violence – బంగ్లా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇంటికి నిప్పు..

అస్తులు ధ్వంసం
చెల‌రేగిపోయిన విధ్వంస కారులు
మాజీ ప్ర‌ధాని షేక్ హ‌సీనా కు గ‌ట్టి మ‌ద్ద‌తుదారు
అవామీ లీగ్ నుంచి ఎంపిగా ఎన్నిక

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – డాకా – బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా కూడా తన సొంత దేశం నుంచి పారిపోయింది. హసీనా నిర్ణయం తర్వాత బంగ్లాదేశ్‌లో హింసాత్మక వాతావరణం నెలకొంది. ఈ దాడుల్లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మష్రఫే మోర్తజా ఇంటిని ఆందోళనకారులు ధ్వంసం చేసి.. ఆపై ఇంటిని తగుల బెట్టారు. మష్రాఫే మాజీ ప్ర‌ధాని షేక్ హసీనాకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. అతని ఇంటిపై నిరసనకారులు దాడి చేసినప్పుడు ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

- Advertisement -

కాగా, ఖుల్నా డివిజన్‌లోని నరైల్-2 నియోజకవర్గం నుంచి మష్రఫే మోర్తజా ఎంపీగా ప్రతినిధ్యం వహిస్తున్నారు. అయితే, మష్రఫే తన క్రికెట్ కెరీర్‌లో బంగ్లాదేశ్‌కు 117 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతను 390 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు.. 36 టెస్టులు, 220 వన్డే మ్యాచ్ లతో పాటు 54 టీ20 మ్యాచ్‌లలో 2,955 పరుగులు చేశాడు. ఇక, 2017లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత 2018లో అవామీ లీగ్‌లో మొర్తజా చేరారు. పార్లమెంటరీ ఎన్నికల్లో నరైల్-2 స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement