Monday, November 25, 2024

Manipur : మ‌ణిపూర్ లో మ‌ళ్లీ హింస‌.. ప‌ది మంది మృతి

గత కొన్ని రోజులుగా మణిపూర్ రాష్ట్రంలో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా.. రాష్ట్రంలో జరిగిన అల్లర్లలో ఓ మహిళతో పాటు మరో 9 మంది మరణించారు. మణిపూర్ లోని ఓ చర్చిలో గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడటంతో.. ఒక మహిళతో పాటు 10 మంది మరణించాగా.. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. తూర్పు ఇంఫాల్ లోని ఖమెన్ లోని ఓ చర్చిలో మంగళవారం రాత్రి దుండగులు కాల్పులకు దిగినట్లు తెలుస్తుంది. కాల్పులు జరిగే సమయంలో చర్చిలో 25 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారు ప్రస్తుతం ఇంఫాల్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మరణాలతో మణిపూర్ హింసాత్మక ఘటనల్లో మృతుల సంఖ్య 115కి చేరింది. ఈ ఘటనలో కుకీ మిలిటెంట్ ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కుకీ వర్గంపై జరిగిన కాల్పులపై ఇంఫాల్ తూర్పు జిల్లా ఎస్పీ కె.కె. శివకాంత్ సింగ్ పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్ భద్రతను మోహరించినట్లు ఎస్పీ తెలిపారు. అల్లర్లు జరుగకుండా బలగాల ఉనికిని పెంచామని పోలీసులు చెప్పారు. హింసాకాండ తర్వాత ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని ఎస్పీ వెల్లడించారు. ఇంతలో, కుకీ మరియు మెయిటీ కమ్యూనిటీల ప్రజల నుండి భిన్నమైన వాదనలు వస్తున్నాయి. తమ గ్రామంలో దాడి చేసింది.. మైటీ వర్గానికి చెందిన వారే చేశారని కుకీ సంఘం ప్రజలు ఆరోపిస్తున్నారు. తమ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు లైసెన్స్ ఉన్న ఆయుధాలతో దుండగులను ఎదుర్కోవడానికి ప్రయత్నించారని కుకీ ప్రజలు పేర్కొన్నారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు అధునాతన ఆయుధాలతో నిద్రపోతున్న సమయంలో కాల్పులు జరపడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరుగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. మరో వివాదం తలెత్తకుండా నిరోధించడానికి ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement