Sunday, November 24, 2024

TS | కోడ్ ఉల్లంఘన.. అమిత్‌ షాపై కేసు నమోదు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై కేసు న‌మోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ అమిత్‌ షాపై కాంగ్రెస్ నేత జి.నిరంజన్ సీఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో హైదరాబాద్‌లోని మొఘల్‌పురా పోలీస్‌ స్టేషన్‌లో అమిత్ షాపై కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ జరపాలని హైదరాబాద్‌ సీపీకి ఎన్నికల సంఘం ఆదేశించింది.

మే1న హైదరాబాద్‌లోని పాతబస్తీ పర్యటన సందర్భంగా.. అమిత్‌ షా ఎలక్షన్ కమిషన్ రూల్స్ బ్రేక్ చేశారని కాంగ్రెస్ పీసీసీ వైస్ ప్రెసిజెంట్ జి.నిరంజన్ ఎన్నికల ప్రధాన అధికారికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి మాదవిలత, అమిత్‌ షా, కిషన్‌ రెడ్డి, రాజాసింగ్‌లు ఎన్నికల నియమాలు పట్టించుకోకుండా.. చిన్నారులతో ప్రచారం చేయించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మొఘల్‌పురా పీఎస్‌లో వీళ్లపై కేసు నమోదైంది. A1గా యమాన్ సింగ్, A2 ఎంపీ అభ్యర్థి మాధవి లత, A3 అమిత్ షా, A4 కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, A5 ఎమ్మెల్యే రాజాసింగ్‌ పేర్లను పోలీసులు చేర్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement