Monday, November 18, 2024

Vinesh Phogat | ఆ అవార్డులను తిరిగి ఇవ్వాలనుకుంటున్నా.. ప్రధాని మోదీకి బహిరంగ లేఖ

భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గొడవకు నిరసనగా తన ఖేల్ రత్న, అర్జున అవార్డులను తిరిగి ఇస్తున్నట్లు ఒలింపియన్ వినేష్ ఫోగట్ మంగళవారం(డిసెంబర్ 26) రోజున తెలిపారు. కొద్దిసేపటి క్రితమే ఆమె ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించింది. మల్లయోధులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నిరసన వ్యక్తం చేసినప్పటికీ మహిళా రెజ్లర్‌లకు జర‌గిన న్యాయంపై వినేష్ ఫోగట్ నిరాశను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి బహిరంగ లేఖలో వినేష్ ఫోగట్ ఆవేదన వ్యక్తం చేశారు.

‘నేను నా ఖేల్‌రత్న, అర్జున అవార్డులను వాపస్‌ ఇచ్చేస్తున్నా’ అని అందులో పేర్కొంది. బజరంగ్‌ పునియా తర్వాత అవార్డును ప్రభుత్వానికి తిరిగిచ్చేసిన రెజ్లర్ల జాబితాలో ఫోగాట్ రెండో క్రీడాకారిణి. బధిరుల ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణాలు నెగ్గిన విజేందర్‌ సింగ్‌ కూడా సాక్షి మాలిక్‌ రెజ్లింగ్‌ నుంచి తప్పుకున్నాక తన అర్జున అవార్డును వాపస్‌ ఇచ్చేస్తానని ప్రకటించినా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో అతడు దీనిపై ఎటువంటి ప్రకటనా చేయలేదు.

- Advertisement -

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన పరిణామాలతో పలువురు రెజ్లర్లు తీవ్ర కలత చెందిన విషయం తెలిసిందే. ముఖ్యంగా డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ సన్నిహితుడు సంజయ్‌ సింగ్‌ గెలుపొందిన వెంటనే సాక్షి మాలిక్‌ రెజ్లింగ్‌ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించగా బజరంగ్‌ పునియా తన అర్జున అవార్డును వెనక్కిచ్చేశాడు. ఈ పరిణామాలతో అలర్ట్‌ అయిన కేంద్రం.. సంజయ్‌ సింగ్‌ ప్యానెల్‌ను సస్పెండ్ చేసింది. రెండు రోజుల క్రితమే బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ కూడా తనకు రెజ్లింగ్‌తో ఏం సంబంధం లేదని, ఈ ఆటకు ఇక సెలవు అని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. బ్రిజ్‌ భూషణ్‌ను తప్పిస్తే ఈ అంశం చల్లారుతుందని భావించినా వినేశ్‌ ఫోగాట్‌ తాజా ప్రకటనతో ఈ చిచ్చు ఇప్పట్లో ఆరేలా లేదని తెలుస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement