ప్యారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50 కిలోల కేటగిరీలో దూకుడుగా ఆడుతూ ఫైనల్స్ వరకు చేరిన భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్‌కు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. 100 గ్రాములు అధిక బరువు ఉందనే కారణంతో ఆమెపై అనర్హత వేశారు. దీంతో ఆమె కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌లో అప్పీలు దాఖలు చేసింది. తనకు కనీసం సిల్వర్ మెడల్ అయినా ఇవ్వాలని కోరింది.
వినేశ్ ఫోగట్‌పై అనర్హత వేటు వేయడం భారతీయుల మనస్సులను చెదరొగట్టాయి. అయితే, హర్యాణా ఖాప్ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. పారిస్ నుంచి వినేశ్ ఫోగట్ ఇండియాకు తిరిగి వచ్చినప్పుడు ఆమెకు ఘనస్వాగతం పలకాలని నిర్ణయించారు. అలాగే.. పెద్ద సభ ఏర్పాటు చేసి వినేశ్ ఫోగట్‌కు గోల్డ్ మెడల్ అందించాలని ఖాప్ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు.