వినాయక చవితి పర్వదినం దగ్గర పడుతుండటంతో గణేష్ విగ్రహాల తయారీలో వేగం పెరిగింది. గత ఏడాది కరోనా కారణంగా వినాయక చవితి వేడుకలు ఇళ్లకే పరిమితమయ్యాయి. భారీ విగ్రహాలు కొనేవారు లేక తయారీదారులు నష్టాలు చవిచూశారు. ఈసారి కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని భక్తులు భావిస్తున్న తరుణంలో తయారీదారుల్లో జోష్ కనిపిస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున బొజ్జ గణపయ్య విగ్రహాలను తీర్చిదిద్దిన తయారీదారులు వాటికి తుదిమెరుగులు దిద్దుతున్నారు.
మరోవైపు ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం కూడా ముస్తాబవుతోంది. ఈ ఏడాది ఖైరతాబాద్‌లో పది తలలతో ఏకాదశి రుద్ర మహాగణపతిగా గణేషుడు కొలువు తీరనున్నాడు. ఏకాదశ రుద్ర మహా గణపతిగా ముస్తాబై భక్తుల పూజలు అందుకోనున్నాడు. కరోనా ప్రభావం కారణంగా ఈసారి గణపతి విగ్రహం 27 అడుగుల ఎత్తు ఉండనుంది.
ఈ వార్త కూడా చదవండి: తెలంగాణ తదుపరి సీఎం రేవంత్ రెడ్డి.. వైరల్ అవుతున్న సర్వే