Friday, November 22, 2024

ద‌స‌రా కోసం విలేజ్ సెట్ వేశాం..అవినాష్

ఇటీవల నిర్మాణమవుతున్న అనేక చిత్రాలు సహజసిద్దమైన ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుం టున్నాయి. షూటింగ్‌కు వీలు అవని చోట ప్రత్యే కంగా సెట్‌ వేస్తున్నారు. అలా సెట్‌ వేసిన సినిమాల్లో దసరా కూడా ఉంది. నేచురల్‌ స్టార్‌ నాని నటిస్తున్న దసరా చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకువస్తోంది. శ్రీకాంత్‌ ఒదెల దర్శకుడు. కీర్తి సురేష్‌ కథానాయిక. సుధాకర్‌ చెరుకూరి నిర్మిసున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్‌ గా విడుదలౌతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి ఆర్ట్‌ డైరెక్టర్‌ గా పని చేసిన అవినాష్‌ కొల్లా విలేఖరుల సమావేశంలో దసరా విశేషాలని పంచు కున్నారు.


నాని తో ఇంతకు ముందు చేసిన చిత్రాలకు దసరా పూర్తిగా భిన్నమైంది కదా?
అవును. దసరా కథా నేపథ్యం పూర్తిగా భిన్న మైనది. తెలంగాణలోకి ఒక ఊరికి సబంధించిన కల్చర్‌, అలవాట్లు-, కట్టు-బాట్లు- వుంటాయి. ఆ ఊరికి కోల్‌ మైన్‌ దగ్గరగా వుండటం వలన పెద్దపెద్ద వాహ నాలు ఊరి నుంచే వెళ్తాయి. దాని కారణంగా సహజంగానే రస్టిక్‌ టోన్‌ వచ్చింది. నాని గారితో జర్నీ చాలా బావుంది. ఆయన నమ్మకాన్ని నిలబెట్టు-కుంటూ నా వంతు న్యాయం చేస్తున్నాను. దసరా చాలా డిఫరెంట్‌ మూవీ. కల్చరర్‌ గా ఒక పాతికేళ్ళ క్రితం నాటి ఊరు ఇందులో కనిపిస్తుంది. ఈ సినిమా కథకు సరిపోయే ఊరు కావాలి. దాని కోసం అడవి లాంటి ఒక ఖాళీ ప్రదేశం తీసుకొని భారీ విలేజ్‌ సెట్‌ వేశాం. ఇల్లు, స్కూల్‌, ఒక మైదానం, బార్‌ ఇలా ఒక ఐదు వందల మంది నివసించే గ్రామాన్ని నేచు రల్‌గా క్రియేట్‌ చేశాం. 98 శాతం షూటింగ్‌ సెట్‌ లోనే జరిగింది.

ఏమైనా రిఫరెన్స్‌ లు తీసుకున్నారా ?
ఈ గ్రామనికి ఆల్రెడీ గోదారి ఖని రిఫరెన్స్‌ వుంది. లైవ్‌ లోకేషన్స్‌ లో తిరిగాం. కానీ కథకి ఒక ప్లేస్‌ మెంట్‌ ముఖ్యం. రియల్‌ -టైం ఎక్కడికి వెళ్ళిన మనకి కావాల్సినట్లు- వుండదు. దానితో పాటు- కంఫర్ట్‌ బుల్‌ గా షూట్‌ చేసుకోలేం. అన్ని రోజుల అవుట్‌ డోర్‌లో షూట్‌ చేయడం అంటే బడ్జెట్‌ కంట్రోల్‌ కష్టం కాబట్టి సెట్‌ కి వెళ్ళాం.

దర్శకుడు శ్రీకాంత్‌ ఒదెల తో పని చేయడం ఎలా అనిపించింది ?
శ్రీకాంత్‌ ది తెలంగాణ నేపథ్యం. తన ఊరు గురించే కథ రాసుకున్నాడు. తొలిసారి దర్శకత్వం చేస్తున్నప్పటికీ అన్ని విషయాలపై చాలా క్లారిటీ- వుంటు-ంది. తన కథకి ఏం కావాలో అతనికి చాలా బాగా తెలుసు.

సెట్‌ లో మీరు ఎదురుకొన్న సవాల్‌ ఏంటి ?
ఇంటిపై వేసే పెంకులో కూడా ఆంధ్రకి తెలంగాణకి తేడా వుంటు-ంది. అవన్నీ జాగ్రత్తలు తీసుకున్నాం. వర్కింగ్‌ డేస్‌ ఎక్కువ కాబట్టి సిమెంట్‌ స్టోన్స్‌ విండోలు తలుపులు ఏవీ డమ్మి లేకుండా నేచురల్‌ గా కలెక్ట్‌ చేయడానికి చాలా సమయం పట్టింది. మైనింగ్‌ కి చుట్టు-పక్కల వున్న గ్రామాల్లో ఎలాంటి వాతావరణం వుంటు-ందో అదే వాతవరణాన్ని చాలా సహజంగా క్రియేట్‌ చేశాం. ఇందులో ఒక పెద్ద బంగ్లా వుంటు-ంది. అందులో ఒకొక్క దర్వాజనే మూడు లక్షలు పెట్టి కొన్నాం.

సెట్‌ వేయడానికి ఎన్ని రోజులు పట్టింది ?
గత ఏడాది నవంబర్‌ లో స్టార్‌ చేశాను. నవంబర్‌ అంతా క్లీన్‌ చేయడానికే సరిపోయింది. పక్కన స్నేక్‌ ఫారెస్ట్‌ . దీంతో పాములు బెడద వుండేది. సెట్‌లో చల్లదనం కోసం పాములువచ్చి వుండేవి. పైగా రాత్రుల్లో ఎక్కువ షూటింగ్‌ వుండేది. మొత్తం సెట్‌ వేయడానికి రెండున్న నెలలు పట్టింది. దాదాపు 800 పైగా పని చేశారు. బుల్‌ డూజర్‌, క్రెయిన్‌ ఎప్పుడూ సెట్‌లో వుండేది. దాదాపు 22 ఎకరాల్లో సెట్‌ వేశాం. -టైన్‌ సీక్వెన్స్‌ కూడా అక్కడే వేశాం. ప్రొడక్షన్‌ వైజ్‌గా చాలా కలిసొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement