కామాంధుల చేష్టలకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉంటున్నారు. తాజాగా మైనర్ బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి యత్నించాడు. ఈ సంఘటన మహబూబాద్ జిల్లాలోని డోర్నకల్ మండలంలోని బొడ్రాయి తండాలో వెలుగుచూసింది. తండాకు చెందిన బాలిక మిర్చి కళ్ళం వద్దకు వెళ్ళి ఇంటికి వస్తుంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన తేజవత్ గోబాల్ ( 48) ఇంటి ముందుకు రాగానే బలవంతంగా ఇంట్లోకి ఎత్తుకు వెళ్ళాడు. లైంగిక దాడికి ప్రయత్నిస్తున్న క్రమంలో బాలిక తప్పించుకుని బయటపడింది.
ఈ తతంగం అంతా సీసీ కెమెరాలో రికార్డ్ కావటంతో బాలిక కేకలు పెడుతూ ఏడుస్తూ బయటికొస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు కామాంధుడిని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు నిందితుడిపై పొక్సో చట్టం మరియు ఐపిసి చట్టాల క్రింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.