Friday, November 22, 2024

పల్లె ప్రగతితో గ్రామ స్వరూపాలే మారిపోతున్నాయి : మంత్రి పువ్వాడ

పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం వాంకుడోత్ తండా, రాంక్యా తండా గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని పలు అభివృధ్ది పనులను ప్రారంభించారు. వాంకుడోతు తండా గ్రామంలో రూ.20.50లక్షల రూపాయలతో నిర్మించిన సైడ్ కాల్వలు, సీసీ రోడ్ల(05 పనులు)ను ప్రారంభించారు. రాంక్యా తండా గ్రామంలో రూ.60.75 లక్షల రూపాయలతో నిర్మించిన సైడ్ కాల్వలు, సీసీ రోడ్ల(18 పనులు)ను మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాధమిక పాఠశాల అవరణంలో నిర్వహించిన గ్రామ సభలో మాట్లాడారు. అనంతరం పాఠశాల తరగతి గదులు, టాయిలెట్స్ ను పరిశీలించారు. పాఠశాలలు పున ప్రారంభం అయ్యె లోగా విద్యార్థులకు కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ VP గౌతమ్, సుడా చైర్మన్ విజయ్, AMC చైర్మన్ లక్ష్మీప్రసన్న, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపిటిసిలు, వార్డు సభ్యులు, నాయకులు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement