Tuesday, November 26, 2024

చంద్ర‌యాన్ 3 లో మ‌రో కీల‌క‌ఘ‌ట్టం – స్పేస్‌ క్రాఫ్ట్ నుంచి విడిపోయిన విక్ర‌మ్ ల్యాండ‌ర్

న్యూఢిల్లీ: చంద్ర‌యాన్‌-3 మిష‌న్ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఇవాళ ఆ ప్రాజెక్టులో భాగ‌మైన కీల‌క ఘ‌ట్టం చోటుచేసుకున్న‌ది. చంద్ర‌యాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్ నుంచి విక్ర‌మ్ ల్యాండ‌ర్ స‌క్సెస్‌ఫుల్‌గా విడిపోయింది. ఈ విడిపోయిన ల్యాండ‌ర్ విక్ర‌మ్ నెమ్మ‌దిగా చంద్రుడివైపు క‌దులుతున్న‌ది.. ఈ ల్యాండ‌ర్ ఈనెల 23, లేదా 24వ‌ తేదీన చంద్రుడి ఉప‌రిత‌లంపై దిగ‌నున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.

ప్రొప‌ల్ష‌న్ మాడ్యూల్ నుంచి ల్యాండ‌ర్ వేరైన‌ట్లు ఇస్రో వ‌ర్గాలు వెల్ల‌డించాయి. దీంతో చంద్ర‌యాన్‌-3 ప్రాజెక్టులో ఓ కీల‌క ఘ‌ట్టం ముగిసింది. ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు సంబ‌రాల్లో తేలిపోయారు. స్పేస్‌క్రాఫ్ట్ నుంచి విక్ర‌మ్ విడిపోయిన నేప‌థ్యంలో ఇవాళ ఇస్రో త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో ఈ విష‌యాన్ని పోస్టు చేసింది. రేపు సాయంత్రం నాలుగు గంట‌ల‌కు ల్యాండ‌ర్ విక్ర‌మ్‌.. చంద్రుడి ఉప‌రిత‌లానికి మ‌రింత చేరువ‌కానున్న‌ట్లు వెల్ల‌డించింది.

https://twitter.com/chandrayaan_3/status/1692084711852806463
Advertisement

తాజా వార్తలు

Advertisement