పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేయడంలో మహాదిట్ట తమిళ స్టార్ హీరో విక్రమ్..కాగా ఆయన తాజాగా నటిస్తోన్న చిత్రం తంగాలన్. అప్పట్లో ‘నరాచీ’ ప్రాంతంలో దళితులపై జరిగిన మారణకాండ నేపథ్యంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్ పొడవైన గుబురు గెడ్డం .. గోచీగుడ్డతో కనిపించనున్నాడు. చెవికి పోగులు .. చేతిలో కర్ర .. ముంజేతికి కడియంతో కనిపించనున్నాడు. ఈ పాత్రకి సంబధించిన మేకప్ కోసం ఆయనికి 4 గంటల సమయం పడుతోందట. అంతసేపు ఓపికగా కూర్చోవటం ఆయన సహనానికి నిదర్శనమని అంటున్నారు. ఈ చిత్రంలో పార్వతీ మీనన్ .. మాళవిక మోహనన్ కథానాయికలుగా కనిపించనున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమాకి, పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్య్రం రాకముందు జరిగిన కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement