Monday, November 18, 2024

Vijayawada – కొనసాగుతున్న ప్రకాశం బ్యారేజ్ గేట్ల మరమ్మతులు ….

ప్రకాశం బ్యారేజీకి రిపేర్లు
బోట్లు ఢీకొట్ట‌డంతో గెట్ల‌కు డ్యామేజీ

రంగంలోకి దిగిన‌ ఇరిగేషన్ అధికారులు
67, 69 గేట్లను స‌రిచేసేందుకు చ‌ర్య‌లు
పనుల్లో నిమ‌గ్న‌మైన అధికారులు
కౌంటర్ వెయిట్‌ల మార్పిడికి కసరత్తు

ఆంధ్రప్రభ స్మార్ట్, ఎన్టీఆర్ జిల్లా బ్యూరో:
కృష్ణానది ఉధృతి తగ్గటంతో.. ప్రకాశం బ్యారేజీలో దెబ్బతిన్న గేట్లకు అధికారులు గురువారం మరమ్మతులు చేపట్టారు. నిపుణుల పర్యవేక్షణలో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ 67, 69 నెంబర్‌ గేట్లకు రిపేరు పనులు సాగుతున్నాయి. బ్యారేజ్‌ 69వ గేటు వద్ద పడవ ఢీకొని కౌంటర్‌ వెయిట్‌ దెబ్బతిన్న విషయం తెలిసిందే. నిపుణులు కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. చీఫ్‌ ఇంజినీర్‌ తోట రత్నకుమార్‌ ఈ పనులు పర్యవేక్షిస్తున్నారు. సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌, డ్యామ్‌ సేఫ్టీ చీఫ్‌ ఇంజినీర్‌ రత్నకుమార్‌ ఉన్నారు. ఇరిగేషన్‌ శాఖ అడ్వయిజర్‌ కె.వి.కృష్ణారావు కూడా మరమ్మతు పనులు పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ సీతానగరం పీడబ్ల్యూ వర్క్‌షాప్‌ రిటైర్డ్‌ ఇంజినీర్‌ కె.వి.కృష్ణారావు పర్యవేక్షణలో పనులు సాగుతున్నాయి. సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ ఈఈ ఇంజినీర్‌ విజయసారథి మరమ్మతు పనులను పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -

బోట్ల దెబ్బకు కౌంటర్ వెయిట్ లు ఢమాల్

అనూహ్యంగా .. రెండు రోజు కిందట కృష్ణా నదికి ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతికి కొట్టుకొచ్చిన నాలుగు బోట్ల కారణంగా ప్రకాశం బ్యారేజీ గేట్లకు అనుబంధంగా ఉండే కౌంటర్‌ వెయింట్లు దెబ్బతిన్నాయి. 64వ నంబరు గేటు వద్ద ఉండే వెయిట్‌ దెబ్బతింది.. పూర్తిగా మధ్యకు విరిగిపోయింది. కాంక్రీట్‌ సిమెంట్‌ దిమ్మకు లోపల ఉండే ఇనుప చువ్వలు బయటకు వచ్చేశాయి. ఈనెల 2న కృష్ణా నదికి రికార్డు స్థాయిలో వరద పోటెత్తిన విషయం తెలసిందే. ఎగువన భవానీపురం, గొల్లపూడి, ఇబ్రహీపట్నం ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లి బోట్లకు లంగరేశారు. వరద ఉధృతికి వీటిలో 4 బోట్లు కొట్టుకొచ్చాయి. ఇందులో ఒక బోటు 69వ గేటు వద్ద ఉన్న కౌంటర్‌ వెయిట్‌ను ఢీ కొట్టడంతో విరిగిపోయి ఇరుక్కుపోయింది. ఈ బోటును ఢీ కొని మరో రెండు బోట్లు ఆగిపోయాయి. మరో బోటు 64వ నంబరు ఖానా వద్ద కౌంటర్‌ వెయిట్‌ను ఢీ కొట్టడంతో స్వల్పంగా దెబ్బతింది. ఈ బోటూ ఇక్కడ ఇరుక్కుపోయింది.

రంగంలోకి స్పెషలిస్టు కన్నయ్య నాయుడు

విషయం తెలిసిన ప్రభుత్వం… జలవనరుల శాఖ సలహాదారు, గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడి పిలుపించగా.. అదే రోజు రాత్రి ఆయన హుటాహుటిన బ్యారేజీ వద్దకు చేరుకుని విరిగిన గేట్లను పరిశీలించారు. ఈ రెండు చోట్ల గేట్లకు నష్టంలేదని కూడా నిర్ధారించారు. గేట్లు విరిగి రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం సాయంత్రానికి ప్రకాశం బ్యారేజీ వద్దకు వచ్చారు. బ్యారేజీకి ఈ వైపు నుంచి ఆ వైపు మొత్తం నడుచుకుంటూ వెళ్లి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోను పరిశీలించారు. 64, 69వ ఖానాల వద్ద దెబ్బతిన్న కౌంటర్‌ వెయిట్లను చూశారు. ఆపై అధికారులతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement