పూడ్చే బాధ్యతలు నారా లోకేష్ కు ..
ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు
కమాండ్ కంట్రోల్ నుంచి లోకేష్ బుడమేరు వద్దకు పరుగులు
అధికారులతో స్పాట్ లోనే సమీక్ష
దగ్గరే ఉంటే గండి పూడ్చివేత పనులు పర్యవేక్షణ
విజయవాడ – వర్షాలు వల్ల మళ్ళీ బుడమేరుకు వరద ప్రవాహం పెరిగింది. దీంతో బుడమేరుకు గండ్లు పడిన ప్రదేశంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలకు అధికారులు ఉపక్రమించారు. కొండపల్లి శాంతినగర్ వద్ద బుడమేరుకి మూడు చోట్ల గండ్లు పడ్డాయి. 200 మీటర్ల మేర గండ్లు పడడంతో కవులూరు, ఈలప్రోలు రాయనపాడు, సింగినగర్ మీద బుడమేరు విరుచుకుపడింది. వరద ఉధృతి తగ్గడంతోఇరిగేషన్ అధికారులు గండ్లను పూడుస్తున్నారు.
మరోవైపు బుడమేరుకు పడిన గండ్లు పూడ్చివేత కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా మంత్రి లోకేష్‌ను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటి వరకు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి వరద బాధిత ప్రాంతాలను పర్యవేక్షిస్తున్న లోకేష్ ముఖ్యమంత్రి ఆదేశాలతో బుడమేరు వద్దకు చేరుకున్నారు. బుడమేరు కుడి, ఎడమ ప్రాంతాల్లో పడిన గండ్లు గురించి నారా లోకేష్.. అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా గండ్లు పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆపై గండిపూడ్చివేత పనులలో వేగం పెంచారు.. ముందుగా ఇసుక బస్తాలు వేసి నీటి ప్రవాహాన్ని ఆపారు..