Saturday, September 21, 2024

Thalapathy68 First Look | దళపతి విజయ్ కొత్త సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్!

దళపతి విజయ్ ఇటీవలే ‘లియో’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. విజయ్ తర్వాతి సినిమా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు మేక‌ర్స్. ఈ సినిమాకి ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

ఏజీయస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చాలా కాలం తర్వాత విజయ్ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా, మైక్ మోహన్, జయరాం, యోగిబాబు, అజ్మల్, వీటీవీ గణేష్, వైభవ్, ప్రేమ్‌జీ అమరన్, అరవింద్ ఆకాష్, అజయ్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement