Friday, November 22, 2024

ఈడీ కీలక నిర్ణయం.. మాల్యా, నీర‌వ్‌, చోక్సీ ఆస్తులు బ్యాంకులకు బ‌దిలీ

వ్యాపార‌వేత్త‌లు విజ‌య్ మాల్యా, నీర‌వ్ మోదీ, మెహుల్ చోక్సీలు.. భార‌తీయ బ్యాంకుల‌కు వేల కోట్ల రుణాలు ఎగ‌వేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ మోస‌గాళ్ల‌కు చెందిన సుమారు రూ.9371 కోట్ల ఆస్తుల‌ను ఆయా బ్యాంకుల‌కు ఈడీ బ‌దిలీ చేసింది. అంతేకాదు ఈ ముగ్గురికి చెందిన సుమారు రూ.18,170.02 కోట్ల ఆస్తుల‌ను సీజ్ చేసిన‌ట్లు ఈడీ చెప్పింది. దీంట్లో విదేశాల్లో ఉన్న రూ.969 కోట్ల ఆస్తులు కూడా ఉన్నాయి. ముగ్గురి వ‌ల్ల బ్యాంకుల‌కు జ‌రిగిన న‌ష్టంలో వారి ఆస్తులు అటాచ్ చేసి, సీజ్ చేసిన మొత్తం విలువ 80.45 శాతంగా ఉన్న‌ట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్‌ చెప్పింది.

నీర‌వ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజ‌య్ మాల్యాలు.. ప్ర‌స్తుతం విదేశాల్లో ఉన్నారు. వారిని ఇండియాకు ర‌ప్పించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. అయితే ఈ ముగ్గురూ భార‌తీయ బ్యాంకుల నుంచి సుమారు రూ.22,585 కోట్లు రుణం తీసుకున్నారు. సీబీఐ న‌మోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ ముగ్గురికి చెందిన లావాదేవీల‌ను స‌మీక్షించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement