Tuesday, November 26, 2024

Vijay Diwas – అమ‌ర‌వీరుల‌కు మోడీ ఘ‌న నివాళి..

1971 యుద్ధంలో భారత్ పాకిస్థాన్ పై విజయం సాధించిన రోజు నేడే. సరిగ్గా 52 ఏళ్ల క్రితం పాకిస్థాన్‌ నడ్డివిరిచి పాక్‌ నుంచి బంగ్లాదేశ్ కు విముక్తి కల్పించడంలో భారత సైన్యం కీలక పాత్ర పోషించింది. 1971లో తూర్పు పాకిస్థాన్‌లో మొదలైన స్వాతంత్య్ర పోరు భారత్‌-పాక్‌ మధ్య యుద్ధానికి దారి తీసింది. భారత సైన్యం పాక్‌ను ఓడించి, బంగ్లాదేశ్‌ అవతరణకు కారణమైంది. ఆ విజయానికి గుర్తుగా భారత్‌ ఏటా డిసెంబర్‌ 16న ‘విజయ్‌ దివస్‌’ ను నిర్వహిస్తుంది.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ , రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితరులు యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, సహాయ మంత్రి అజయ్ భట్ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement