Sunday, November 3, 2024

Tamil Nadu | డీఎంకే, బీజీపీపై విజయ్‌ విమర్శలు..

నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ వ్యవస్థాపకుడు, విజయ్… తమిళనాడులోని స్టాలినిస్ట్ ప్రభుత్వం (డీఎంకే), కేంద్రంలో బీజేపీ పాలనపై నిప్పులు చెరిగారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ ‘జమిలి’ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఒకే దేశం – ఒకే ఎన్నికలను అమలు చేసే ప్రయత్నం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఈ చర్యను ఖండిస్తున్నామన్నారు.

చెన్నైలో టీవీకే పార్టీ జిల్లా ఆఫీస్‌ బేరర్లు, కార్యవర్గ సభ్యులతో నేడు ఆదివారం తొలిసారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీవీకేని సంస్థాగతంగా బలోపేతం చేయడం, ప్రజలకు చేరువయ్యే అంశాలపై ప్రధానంగా చర్చించి 26 తీర్మానాలను ఆమోదించారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో హిందీకి రాష్ట్రంలో చోటులేదని… ద్విభాషా సిద్ధాంతమే అమలులో ఉండాలని స్పష్టం చేశారు.

కేంద్రం పెత్తనం లేకుండా రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక‌, తమిళనాడులో శాంతిభద్రతల అంశంపై విమర్శలు గుప్పించారు. ఇక, తమిళనాడులో శాంతిభద్రతల సమస్య ఉందని విమర్శించారు. తమిళనాడులో కుల గణన జరగాలని, పరందూర్ విమానాశ్రయ ప్రాజెక్టును రద్దు చేయాలని కోరారు. నిర్ణీత గడువును నిర్ణయించి క్రమంగా మద్యం దుకాణాలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement