Saturday, November 23, 2024

పేటీఎం ఎండీగా విజయ్‌, మళ్లీ ఐదేళ్ల పాటు సేవలు.. ఆమోదించిన బోర్డు సభ్యులు

పేటీఎం.. స్టాక్‌ మార్కెట్‌లో పీకల్లోతు కష్టాల్లో ఉన్న సంస్థ.. ఈ నేపథ్యంలో పేటీఎం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మను మళ్లిd.. మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ఛేంజీలకు శనివారం సమాచారం ఇచ్చింది. విజయ్‌ శేఖర్‌ శర్మ ఐదేళ్ల కోసం కంపెనీ సీఈఓ, ఎండీగా వ్యవహరిస్తారని, అయితే ఈయన పదవీ కాలం 2022, డిసెంబర్‌ 19 నుంచే ప్రారంభం అవుతుందని వివరించారు. అదేవిధంగా మరో కీలక అంశాన్ని కూడా పేటీఎం సంస్థ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా ఉన్న మాధుర్‌ డియోరాను.. అడిషనల్‌ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్టు వివరించింది. అయితే ఈయన 2022, మే 20 నుంచే ఐదేళ్ల పాటు అడిషనల్‌ డైరెక్టర్‌గా కొనసాగుతారని స్పష్టం చేసింది. అదేవిధంగా మరో కీలక పెట్టుబడిపరమైన అంశాన్ని కూడా బోర్డు ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది.

2027 వరకు బాధ్యతలు..

విజయ్‌ శేఖర శర్మ నియామకానికి సంబంధించిన రీ అపాయింట్‌మెంట్‌ విషయాన్ని కూడా రెగ్యులేటర్స్‌కు పేటీఎం సంస్థ అందజేసింది. 2022 మే 20తో విజయ్‌ శేఖర్‌ శర్మ కాల పరిమితి ముగిసింది. ఈ మేరకు ప్రస్తుత కంపెనీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని శర్మను మళ్లిd సీఈఓ, ఎండీగా పదవీ కాలాన్ని పొడగించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కూడా ఆమోదం తెలిపారు. 2027, డిసెంబర్‌ 18వ తేదీ వరకు ఆయన ఎండీ, సీఈఓగా పని చేస్తారు. మాధుర్‌ డియోరా.. 2016 అక్టోబర్‌ నుంచి కంపెనీలో విధులు నిర్వహిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement