ఆస్ట్రేలియా పార్లమెంట్ ఆవరణలో సిబ్బంది రాసలీలల ఫొటోలు, వీడియోలు లీకవడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. పార్లమెంట్‌లోని ప్రేయర్ రూమ్‌ను ఉద్యోగి టామ్ బెడ్రూమ్‌గా చేసుకున్నారు. అతడితో పాటు ఎంతో మంది సిబ్బంది నీచ పనులకు పాల్పడ్డారు. తోటి సిబ్బందితో పాటు బయటి నుంచి వేశ్యలను పిలిపించుకుని రాసలీలలు కొనసాగించారని ఆ దేశ ప్రధాన మీడియా బహిర్గతం చేసింది. ఓ మహిళ ఎంపీకి సంబంధించిన క్యాబీన్‌లో ఈ కామ కార్యాలు కొనసాగాయని ఆస్ట్రేలియా మీడియా ప్రచురించింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు మీడియాలో కథనాలలో రావడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం వెంటనే వారిపై వేటు వేసింది. అయితే విడుదలయిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండవుతున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement