మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం మరోసారి మూతపబడింది. ఏడుపాయలలో గంగమ్మ తల్లి ఉప్పొంగింది.. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో మంజీరా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆలయం ముందు మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది. వనదుర్గాదేవి ఆలయ మండపంలో నుండి నీరు ప్రవహిస్తుంది.. దీంతో ఆలయ అధికారులు తాత్కాలికంగా గుడిని మూసివేశారు. అయితే రాజగోపురంలో అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. గంగమ్మ తల్లి పరవళ్లను తలకించేందుకు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నారు. నిన్న కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జలాశయాలకు జలకళ వచ్చింది.. ఏడుపాయల ఆలయ అందాలను తలకిస్తూ భక్తులు ఎంజాయ్ చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement