శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 5.02 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 5.27 లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 884.10 అడుగులు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 211.5133 టీఎంసీలు. వీకెండ్ కావడంతో పాటు ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తడంతో ఆ దృశ్యాలను తిలకించేందుకు పర్యాటకులు భారీగా శ్రీశైలం తరలివస్తున్నారు.
ఈ వార్త కూడా చదవండి: మెదక్ జిల్లాలో డ్రైవర్ లేకుండా నడిచిన ట్రాక్టర్ (వీడియో)