Friday, October 18, 2024

IND vs SA | సౌతాఫ్రికా పై విజ‌యం.. మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సిరీస్ కైవ‌సం..

ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న మూడు మ్యాచ్ ల వ‌న్డే సిరీస్ లో భాగంగా… నేడు జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందింది. ఆఖ‌రి బాల్ వ‌ర‌కు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్ లో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు 4 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఇక‌ ఈ విజయంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా సౌతాఫ్రికా ముందు 326 పరుగుల భారీ టార్గెట్ సెట్ చేసింది. కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ (103 నాటౌట్), వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (136) సెంచరీలతో చెలరేగారు. షఫాలీ వ‌ర్మ‌(20), హేమ‌ల‌త (24) లు సైతం రాణించారు.

అనంతరం చేజింగ్‌కు దిగిన సౌతాఫ్రికా ఆఖ‌రి బంతి వ‌ర‌కు పోరాడింది. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (135 నాటౌట్), మారిజానే కాప్ (114) సెంచరీలతో అధరగోట్టారు. అయితే, ఆఖ‌రి ఓవ‌ర్లో సాతాఫ్రికా విజ‌యానికి 11 ప‌రుగులు కావాల్సి ఉండ‌గా.. భార‌త బౌల‌ర్ పూజా వస్త్రాకర్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టి కేవ‌లం 6 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చింది. దీంతో సౌతాఫ్రికా నాలుగు ప‌రుగుల తేగాతో ఓట‌మిపాలైంది. తొలి వ‌న్డేలో భార‌త మ‌హిళ‌లు 143 ప‌రుగుల తేడాతో గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది టీమిండియా.

స్మృతి మంధాన అరుదైన ఘ‌న‌త…

టీమ్ఇండియా మ‌హిళా క్రికెటర్ స్మృతి మంధాన అరుదైన ఘ‌న‌త సాధించింది. మ‌హిళ‌ల వ‌న్డే క్రికెట్‌లో వ‌రుస‌గా రెండు మ్యాచుల్లోనూ శ‌త‌కాలు చేసిన భార‌త ప్లేయ‌ర్‌గా చ‌రిత్ర సృష్టించింది. తొలి వ‌న్డేలోనూ (117) సెంచ‌రీ చేసింది.. నేటి మ్యాచ్‌లో (136)తో అధరగొట్టింది.

- Advertisement -

అదేవిధంగా.. టీమ్ఇండియా త‌రుపున వ‌న్డేల్లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ప్లేయ‌ర్‌గా ఉన్న మిథాలీ రాజ్ రికార్డును మంధాన స‌మం చేసింది. మిథాలీ రాజ్ 211 వ‌న్డే ఇన్నింగ్స్‌ల్లో 7 శ‌త‌కాలు బాద‌గా.. స్మృతి మంధాన 84 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘ‌న‌త‌ను అందుకుంది. వీరి త‌రువాత స్థానాల్లో హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్‌, పూన‌మ్ రౌత్ లు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement