ఆసియాకప్ 2023లో భాగంగా ఇవ్వాల (గురువారం) శ్రీలంక, పాకిస్తాన్ జట్ల మద్య జరిగిన మ్యాచ్ లో శ్రీలంక విజయం సాదించింది. 2 వికెట్ల తేడాతో పాకిస్తాన్ జట్టు పై గెలిచి విజయం సొంతం చేసుకుంది. దీంతో ఫైనల్స్ లో టైటిల్ కోసం భారత్ తో తలపడే చాన్స్ కొట్టేసింది శ్రీలంక.
ఇక, ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన పాక్ బ్యాటింగ్ తీసుకోగా. మ్యాచ్ ని వరుణుడు ఆదుకున్నాడు.. మ్యాచ్ మధ్యలో భారీ వర్షం రావడంతో ఆటకు అంతరాయం కలిగింది. దీంతో ఆటను 42 ఓవర్లకే పరిమితం చేశారు.. అప్పటికే పాక్ ఏడు వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. ఇక.. 253 పరుగుల టార్గెట్తో శ్రీలంక చేజింగ్కు దిగింది.
శ్రీలంక జట్టు నుంచి అత్యధికంగా కుసల్ మెండిస్ 91 పరుగులు చేసి సెంచరీ మిస్ చేసుకోగా., సదీర సమరవిక్రమ 48 పరుగులు చేశాడు. ఇక చివిరిలో చరిత్ అసలంక 49 పరుగులు చేసి నాట్ ఔట్ గా ఉన్నాడు.