మహిళల టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ సంచలన విజయంతో గ్రూప్ టాపర్ ఇంగ్లండ్‌ను మట్టికరిపించి సెమీస్‌కు దూసుకెళ్లింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విండీస్ 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో విండీస్ సెమీస్ బెర్త్ సొంతం చేసుకోగా.. ఇంగ్లండ్ మాత్రం అనూహ్యంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
గ్రూప్-బిలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు చెరో 6 పాయింట్లతో సమానంగా నిలిచాయి. కానీ మెరుగైన రన్‌రేట్ కారణంగా వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచి నాకౌట్‌కు అర్హత సాధించాయి. అంతకుముందు గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టీమ్స్ సెమీస్‌లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. నాట్ సీవెర్ బ్రంట్ (57 నాటౌట్; 50 బంతుల్లో 5 ఫోర్లు) హాప్ సెంచరీతో రాణించగా.. మితగా బ్యాటర్లు విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో ఫ్రెచర్ 3 వికెట్లు తీయగా.. హెలే మాథ్యూ 2 వికెట్లు పడగొట్టింది.
అనంతరం 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 18 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు ఖియానా జోసెఫ్ (52; 38 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ హీలె మాథ్యూస్ (50; 38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) సూపర్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీరు ఆవుటైనా డాటిన్ (19 బంతుల్లో 27), ఆలియా అల్లె నీ (8 నాటౌట్) దూకుడుగా ఆడటంతో విండీస్ భారీ విజయంతో ఐదోసారి ప్రపంచకప్ సెమీస్‌లోకి దూసుకెళ్లింది.
ఇక గురువారం జరిగే తొలి సెమీస్‌లో ఆస్ట్రేలియా – దక్షిణాఫ్రికా, శుక్రవారం జరిగే రెండో సెమీస్‌లో న్యూజిలాండ్ – వెస్టిండీస్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.