BWF ప్రపంచ ఛాంపియన్షిప్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో భారత్‌కు చెందిన హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని నమొదు చేసుకున్నాడు. ఇవ్వాల (శుక్రవారం) కోపెన్‌హాగన్‌లో జరిగిన మ్యాచ్ లో డెన్మార్క్ కి చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ విక్టర్ అక్సెల్సెన్ను 21-13, 15-21, 16-21 తేడాతో ఓడించి సెమీస్ లోకి దూసుకెళ్లాడు భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్.
ఆక్సెల్సెన్ మొదటి గేమ్‌లో తన ప్రత్యర్థి ప్రణయ్ పై 21-13తో గెలిచాడు. అయితే, డెన్మార్క్ ప్రత్యర్థి ఆక్సెల్సెన్ తప్పిదాలను సద్వినియోగం చేసుకున్న భారత షట్లర్ త్వరగా పుంజుకుని 21-15తో రెండో గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. అదే ఉత్సాహంతో మూడవ గేమ్‌లోనూ గణనీయమైన ఆధిక్యం చూపించాడు భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్.
కాగా, ఇవ్వాల జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో భారత్‌కు చెందిన సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి జంట క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఓడి టోర్నమెంట్ నుండి నిష్క్రమించారు. డెన్మార్క్‌కు చెందిన అండర్స్ స్కారప్ రాస్ముస్సేన్-కిమ్ ఆస్ట్రప్ ద్వయం 21-18, 21-19తో మ్యాచ్‌ను చేజిక్కించుకుని భారత ద్వయాన్ని ఓడించింది. రెండు గేమ్‌ల్లోనూ భారత్ మంచి పునరాగమనం చేసినా ఓటమితో వెనుతిరిగింది.