Monday, November 18, 2024

కోటేశ్వరరావు కుటుంబసభ్యులను ఫోన్ లో పరామర్శించిన ‘ఉపరాష్ట్రపతి’

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం, ఘంటసాల మండలం, దేవరకోట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ డాక్టర్ దోనేపూడి కోటేశ్వరరావు గత రెండు రోజుల క్రితం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆయన కుటుంబసభ్యులను ఫోన్ లో పరామర్శించారు. కోటేశ్వరరావు భార్య షీలా, కుమారుడు చరణ్, కుమార్తె కంచర్ల పల్లవి లను పరామర్శించారు. బావమరిది అట్లూరి అశోక్ ( ఆంధ్రా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్) కోటేశ్వరరావు మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కోటేశ్వరరావుకు ఆయనకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. కుటుంబ‌స‌భ్యులు ధైర్యంగా ఉండాలని తెలియజేస్తూ తన సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కోటేశ్వరరావు స్వగృహం వద్ద ఆయన చిత్రపటానికి కుటుంబ సభ్యులు, గ్రామప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అడుసుమిల్లి వెంకట రామారావు, అడుసుమిల్లి భవాని ప్రసాద్, గ్రామ ప్రముఖులు వేమూరి రత్నగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement