కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. ఆస్కార్ ఫెర్నాండెజ్ గత జూలై నుంచి కర్ణాటకలోని మంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన మృతి చెందారు. కర్ణాటకలోని ఉడిపిలో 1941 మార్చి 27న ఆస్కార్ ఫెర్నాండెజ్ జన్మించారు. కాంగ్రెస్లో ఆయన అనతికాలంలోనే కీలక నేతగా ఎదిగారు. 1984, 1989, 1991, 1996లో ఉడిపి నుంచే పోటీ చేసి ఎంపీగా లోక్సభలో అడుగుపెట్టారు. 1998, 2004లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. యూపీఏ హయాంలో రోడ్డు-రవాణా, కార్మికశాఖ మంత్రిగా పాటు అనేక పదవులు చేపట్టారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగానూ ఫెర్నాండెజ్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఫెర్నాండెజ్ గుర్తింపుపొందారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement