Tuesday, November 26, 2024

ఐటీకి ఎంతో సహకరించాం, మీడియాలో వార్తలు ఊహాజనితం.. హీరో మోటో కార్ప్‌ స్పష్టత

ఐటీ విభాగం దాడులతో.. మీడియాలో వస్తున్న వరుస కథనాలపై హీరో మోటోకార్ప్‌ బుధవారం స్పందించింది. తమ సంస్థ చట్టాలను ఎంతో గౌరవిస్తుందని, బలమైన అంతర్గత ఆర్థిక నియంత్రణలు కలిగిన కార్పొరేట్‌ సంస్థగా చెప్పుకొచ్చింది. హీరో మోటో కార్ప్‌ గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. ఐటీ శాఖ అధికారులకు తమ కంపెనీ ఎంతో సహకరించిందని, అన్ని పత్రాలు, నివేదికలు, కీలక డాక్యుమెంట్లను అందజేసిందని వివరించింది. పత్రికల్లో వార్తలు అన్నీ ఊహాజనితమైనవి అని కొట్టిపారేసింది. తమ సంస్థలో ఆర్థిక రిపోర్టులు ఎప్పటికప్పుడు ఆడిట్‌ అవుతాయని తెలిపింది.

మీడియాలో వస్తున్న వార్తలపై బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు హీరో మోటోకార్ప్‌ను వివరణ కోరగా.. సంస్థ పై విధంగా స్పందించింది. భవిష్యత్తులో కూడా కంపెనీకి తమ సహాయ సహకారాలు అందుతాయని స్పష్టం చేసింది. ఐటీ దాడుల్లో.. రూ.1000 కోట్ల వరకు బోగస్‌ ఖర్చులు చేసినట్టు ఆధారాలు లభించినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంగళవారం భారీగా కుంగిన షేరు ధర.. బుధవారం హీరో మోటోకార్ప్‌ ప్రకటనతో కాస్త పుంజుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement