Friday, November 22, 2024

న్యాయదేవత కు న్యాయం కావాలి !!

దేశంలో మహిళలు అన్నింటా సగభాగమన్న భావన విస్తరించింది. ప్రభుత్వాలు మహిళాభ్యుదయానికి పెద్దపీటేస్తున్నాయి. అన్నిరంగాల్లోనూ ప్రోత్సహిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించాయి. ఉద్యోగ, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో మహి
ళలు దూసుకుపోతున్నారు. పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నత ప్రమాణాలతో ముందుకెళ్తున్నారు. కొన్నిరంగాల్లో పురుషులకంటే మహిళలే పై చేయి సాధిస్తున్నారు. రాజ్యాంగ బద్దంగా కూడా రాజకీయ పదవుల్లో మహిళలకు
రిజర్వేషన్లు అమలౌతున్నాయి. గత కొంత కాలంగా సైన్యం, వాయుసేన, నావికాదళాల్లోనూ మహిళల భాగస్వామ్యం పెరిగింది. అయితే భారతీయ న్యాయవ్యవస్థలో మహిళల పాత్రపరిమితం గానే ఉంది. ఈ దేశంలోని అత్యున్నత న్యాయ
స్థానం భారత సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఒకే ఒక మహిళా న్యాయ మూర్తి ఉన్నారు. సుప్రీంకోర్టులో మొత్తం 29 మంది న్యాయ మూర్తులుంటే వారిలో మహిళ ఒకే ఒకరు. అలాగే దేశంలోని హైకోర్టుల్లో మొత్తం 1078మంది పురుష న్యాయమూర్తులుంటే 81 మంది మహిళా న్యాయమూర్తులు మాత్రమే కొలువుదీరున్నారు. అమెరికాలోని న్యాయస్థానాల్లో మహిళా న్యాయమూర్తుల సంఖ్య 27 శాతముంటే వారితో పోలిస్తే పటిష్టమైన న్యాయవ్యవస్థ కలిగిన భారత్ లో ఈ రంగంలో మహిళల భాగస్వామ్యం చాలా స్వల్పం.
ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇందుమల్తోత్ర పదవీ విరమణ సందర్భంగా న్యాయవ్యవస్థలో లింగ సమానత్వంపై చర్చలు మొదలయ్యాయి. సాక్షాత్తు ప్రధాన న్యాయమూర్తి కూడా ఈ విషయంలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు
న్యాయమూర్తుల్లో మహిళా భాగస్వామ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. భారత సుప్రీంకోర్టులోకి 1989 వరకు మహిళా న్యాయమూర్తులు ప్రవేశించలేదు. ఆ ఏడాదే తొలి మహిజా న్యాయమూర్తి నియమితులయ్యారు. ఇక గత 75 ఏళ్ళ స్వత
ంత్ర భారతంలో ఇప్పటివరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా ఏ మహిళకు అవకాశం దక్కలేదు. 1989లో జస్టిస్ట్ ఫాతిమా బీబీ నుండి ఇప్పటి వరకు 8మంది మాత్రమే మహిళా న్యాయమూర్తులు విధులు నిర్వహించారు.ఈ దశలో భవిష్యత్ లోనైనా అత్యున్నత న్యాయస్థానంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాల్సిన ఆవశ్యకతను ఇప్పుడు నిపుణులు నొక్కి చెబుతున్నారు. ఈ ఏడాది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాజ్జీపదవీ విరమణ చేస్తున్నారు. ఆయనతో సహా ఐదుగురు న్యాయమూర్తుల పదవులు ఖాళీ అవుతున్నాయి. ఈ పదవుల భర్తీకి సంబంధించి కొలీజియంలో ఇప్పటికే చర్చ మొదలైంది. కనీసం ఇద్దరు ముగ్గురినైనా మహిళా న్యాయమూర్తుల్ని వివిధ రాష్ట్రాల హైకోర్టుల నుంచి తీసుకురావాలని కొలీజియం భావిస్తోంది. 2008 నుంచి కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ నాగరత్నను సుప్రీం న్యాయమూర్తిగా తీసుకురావాలని కొలీజియం భావిస్తోంది. ఈ ప్రయత్నం సఫలీకృతమైతే ఫిబ్రవరి 2027 నాటికి జస్టిస్
నాగరత్న భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావొచ్చు. అప్పటి నుంచి ఆమె ఎనిమిది మాసాల పాటు ఆ పదవి లో విధులు నిర్వహించొచ్చు. అయితే ఇప్పటికే సుప్రీంకోర్టులో కర్ణాటకకు చెందిన ముగ్గురు పురుష న్యాయమూర్తులున్నారు. ఈసంఖ్య జస్టిస్ట నాగరత్న నియామకానికి అడ్డంకిగా మారే అవకా
శాల్ని నిపుణులు శంకిస్తున్నారు. గుజరాత్ హైకోర్టు మహిళా న్యాయమూర్తి బేలా త్రివేదిపై కూడా కొలీజియం దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆమె హైకోర్టులో మూడో స్థానంలో ఉన్నారు. గుజరాత్ ప్రభుత్వానికి కొంతకాలం న్యాయ కార్యదర్శిగా కూడా ఆమె
వ్యవహరించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఆమెకు సాన్నిహిత్యముంది. దీంతో ఐదేళ్ళ పాటు ఆమెను రాజస్థాన్ హైకోర్టుకు బదలీ చేశారు. తిరిగి గుజరాత్ హైకోర్టుకు తీసుకొచ్చారు. అక్కడే కొనసాగితే ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలు న్నాయి. దీన్ని కూడా కొలీజియంగమనంలోకి తీసుకుంది. ఇదిలా ఉంటే తెలంగాణ హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ట్ హిమకోహ్లికి కూడా సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియమితు లయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె ఈ ఏడాది సెప్టెంబర్ లోపదవీ విరమణ చేయనున్నారు. వీరందరితో పాటు ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా మహిళా న్యాయమూర్తుల ఎంపికపై కొలీజియం దృష్టి సారించింది. అయితే ఈశాన్య రాష్ట్రాల్లోని మూడు హైకోర్టుల్లో కేవలం ఇద్దరు మాత్రమే మహిళా న్యాయమూర్తులున్నారు.

గౌహతి హైకోర్టు జస్టిస్ నూమికుమారి పుకాన్, ఇక్కిం హైకోర్టు జస్టిస్ట్ మీనాక్షి మదరాయ్ లు మాత్రమే ఈశాన్య రాష్ట్రాల్లో మహిళా న్యాయమూర్తులుగా ఉన్నారు. జస్టిస్ నూమికుమారి ఈ ఏడాదే పదవి విరమణ చేస్తారు. జస్టిస్ మీనాక్షి మదన్ రాయ్ 2026వరకు పదవిలో ఉంటారు. వీరిద్దరికీ సబార్డినేట్ నుంచి ఉన్నత న్యాయవ్యవస్థ వరకు అనుభవముంది. జస్టిస్ భానుమతి పదవీ విరమణ అనంతరం ఇలాంటి అనుభవం గల మహిళా న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో అందుబాటులో లేరు. ఈ అంశాన్ని కొలీజియం పరిగణనలోకి తీసుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. న్యాయస్థానాల్లో లింగ వ్యత్యాసంపై అధ్యయనం జరిగినఅటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్ 2020 డిసెంబర్ లో సుప్రీం కోర్టుకు తన నివేదిక సమర్పించారు. ఇందులో న్యాయస్థానంలో లింగ జనాభాను సమతుల్యం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ దశలో సుప్రీంకోర్టులో ఒకేసారి ఐదు న్యాయమూర్తి పదవులు ఖాళీ అయ్యాయి. ఈ పరిస్థితి మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు అవకాశం కల్పిస్తోంది. భారత న్యాయవ్యవస్థ కూడా ఇప్పుడు ఈ దిశగా ఆలోచిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement