ప్రభన్యూస్ : బెంగళూరు కర్నాటకలోని ధార్వాడ్ ఎస్ డీ ఎమ్ మెడికల్ సైన్సెస్ కాలేజీ ఇప్పుడు కరోనా సూపర్ స్ప్రెడ్డర్ మారింది. ఇటీవల ఆ కాలేజీలో ఫ్రెషర్స్ డే నిర్వహించిన తరువాత విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. తొలివిడతలో 300 మందికి పరీక్షలు నిర్వహించగా 66 మంది మెడికోలకు కరోనా పాజిటివ్ గా తేలింది.
ఆ తరువాత మరో 200మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 189 మందికి పాజిటవ్ గా తేలింది. దీంతో కళాశాలను మూసివేశారు. హాస్టళ్లనుంచి విద్యార్థులను చికిత్స కోసం తరలించారు. నూతన అడ్మిషన్లను నిలిపివేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital