Monday, November 25, 2024

తుర్క్‌మెనిస్తాన్‌తో బహుముఖ భాగస్వామ్యం.. అధ్యక్షుడు సెర్దార్‌తో కోవింద్‌ చర్చలు

భారత్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. తుర్క్‌మెనిస్తాన్‌లో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. అక్కడికి చేరుకున్న కోవింద్‌ను.. ఆ దేశ అధ్యక్షుడు సెర్దార్‌ బెర్డిముహమెడోవ్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య దైపాక్షిక చర్చలు జరిగాయి. భారతదేశం మధ్య ఆసియా శిఖరాగ్ర సమావేశం ఫ్రేమ్‌వర్క్‌తో సహా ద్వైపాక్షిక, ప్రాంతీయ సహకారంపై ఇరువురు చర్చించారు. విపత్తు నిర్వహణ, ఆర్థిక మేధస్సు, సంస్కృతి, యువజన వ్యవహారాల్లో సహకారం కోసం భారత్‌, తుర్క్‌మెనిస్తాన్‌ మధ్య 4 ఒప్పందాలు జరిగాయి. బహుముఖ భాగసామ్యం బలోపేతానికి అంగీకరించినట్టు కోవింద్‌ తెలిపారు. వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలను కూడా మార్పిడి చేసుకున్నామన్నారు.

దీంతో పాటు అంతర్జాతీయ నార్త్‌ సౌత్‌ ట్రాన్స్‌పోర్టు కారిడార్‌, అష్గాబత్‌ ఒప్పందానికి సంబంధించిన ప్రాధాన్యతను తాము ఎత్తి చూపామని కోవింద్‌ వివరించారు. ఇరాన్‌లో భారత్‌ నిర్మించిన చబహార్‌ ఓడరేవు భారత్‌, ఆసియా మధ్య వాణిజ్యాన్ని మెరుగుపర్చడానికి ఉపయోగపడుతుందని వివరించారు. తుర్క్‌మెనిస్తాన్‌ కొత్త అధ్యక్షుడు బెర్డిముహమెడోవ్‌ పదవీ బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల తరువాత జరిగిన స్వతంత్ర తుర్క్‌మెనిస్తాన్‌కు భారత్‌ రాష్ట్రపతి మొదటి పర్యటన కావడం గమనార్హం. తుర్క్‌మెనిస్తాన్‌లో రాష్ట్రపతి పర్యటనకు ముందు, విదేశాంగ మంత్రిత్వ శాఖ తుర్క్‌మెనిస్తాన్‌తో తన సంబంధాలకు భారత్‌ విలువ ఇస్తుందని పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement