కమెడియన్..వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం బలగం. తాజాగా దర్శకుడు వేణు యెల్దండికి ఉత్తమ దర్శకుడిగా అంతర్జాతీయ అవార్డు దక్కింది. ఆమ్స్టర్డామ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో ఉత్తమ దర్శకుడు అవార్డును గెలుచుకున్నారు. నటుడు ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. మరుళీధర్ గౌడ్, రచ్చ రవి కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజ్ తన సొంత బ్యానర్ లో నిర్మించారు. ఈ చిత్రం అంతర్జాతీయంగానూ గుర్తింపు తెచ్చుకుంటోంది. అవార్డుల పంట పండిస్తోంది. మార్చి 3న విడుదలై ఈ చిత్రం ఇప్పటి వరకు 9 అవార్డులను సొంతం చేసుకుంది.
ఉగాది సందర్భంగా తెలుగు సినిమా వేదిక నుంచి నంది అవార్డు, లాస్ ఏంజెల్స్ సినిమాటోగ్రఫీ నుంచి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఐదు రోజుల కింద ఉక్రెయిన్ లోని ఒనికో ఫిల్మ్ అవార్డ్స్ నుంచి బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డును గెలుచుకున్నారు. అలాగే బెస్ట్ సౌండ్ డిజైన్ విభాగంలో ఏథెన్స్ ఇంటర్నేషనల్ మంత్లీ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు దక్కింది. DC ఇంటర్నేషనల్ సినిమా ఫెస్టివల్ లో ఏకంగా నాలుగు అవార్డులను గెలుచుకున్నారు. బెస్ట్ ఫీచర్ డైరెక్టర్, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ కథనం విభాగంలో డీసీ ఇంటర్నేషనల సినిమా అవార్డులను ప్రకటించారు..