ప్రభ న్యూస్, హైదరాబాద్ (ప్రతినిధి) : సికింద్రాబాద్‌తో పాటు నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచి బయలుదేరే రైళ్లలో వెండర్లు ఆహార పదార్థాలను ఇష్టారాజ్యంగా ధరలతో విక్రయాలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ నిర్దేశించిన రేట్లకన్నా అధికంగా వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. 2013 తర్వాత రైల్వేశాఖ ఐఆర్టీసీ కేటరింగ్ రేట్లు తక్కువగా ఉన్నాయని, 2019లో రివైజ్ చేసి కొత్త రేట్లను నిర్దేశించింది. అయినా రై లు ప్లాట్ ఫాం, రైలు బోగీలలో ఆహార పదార్థాలను అమ్మే వెండర్లు ప్యాసింజర్లను బట్టి రేట్లను మార్చుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
టీ, కాఫీ, వాటర్ బాటిల్ నుంచి మొదలుకుని బ్రేక్ ఫాస్ట్, మీల్స్ వరకు అన్నింటా ప్రయాణికులు నిలువు దోపిడికి గురవుతున్నారు. రైల్వేస్టేషన్ క్యాంటీన్, బోగీలో టీ రూ.5, టీ విత్ టీ బ్యాగ్ రూ.10 అమ్మాలి. కాని అన్నింటికి రూ.10 వసూలు చేస్తున్నారు. రైల్ నీరు పేరిట రైల్వే శాఖ తయారు చేసిన వాటర్ బాటిల్‌ను దానిపై ఎంఆర్పీ రేటు రూ.15 కంటే ఎక్కవ అమ్మరాదు. అయినా ప్రయాణికుల నుంచి రూ. 20 వసూలు చేస్తున్నారు. బ్రేక్ ఫాస్ట్ రైల్వే క్యాంటీన్లలో రూ.35, రైళ్లలో రూ.40 అమ్మాలి. కాని ప్రయాణికులను బట్టి రూ.40 నుంచి రూ.50 వసూలు చేస్తున్నారు. ఇక రూ.20కి అమ్మాల్సిన జనతా మీల్స్ రైలు ప్లాట్ ఫాంలతో పాటు రైలు బోగీలలో ఎక్కడా కనిపించదు.
క్వాలిటీ, క్వాంటిటీకి ఎగనామం ..
రైల్వే ప్లాట్ ఫాం, బోగీలలో విక్రయించే ఆహార పదార్థాల్లో క్వాలి టీ, క్వాంటిటీని పాటించడం లేదు. రైల్వే శాఖ నిర్దేశించిన పరిమాణంలో ఏ వస్తువును ప్రయాణికులకు అందించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఎప్పుడో తయారుచేసి పాడైపోయిన ఆహారాన్నిసైతం అప్పుడప్పుడు అమ్ముతున్నారని విమర్శలను సైతం ఐఆర్టీసీ మూటగట్టుకుంటోంది. రూ. 5కు 150 ఎంఎల్ టీ అందించాల్సి ఉండగా 100 ఎం ఎల్ కూడా పోయడం లేదు. వెజిటేరియన్ మీల్స్‌లో 150 గ్రాముల అన్నం, 2 పరాటాలు లేదా 4 చపాతీలు, 150 గ్రాముల పప్పు, 100 గ్రాముల కూర, 80 గ్రాముల పెరుగు, 40 గ్రాముల స్వీట్, 250 గ్రాముల వాటర్ బాటిల్ అందించాలి. కాని ఇవేమి అటు స్టేషన్ క్యాంటీన్లతో పాటు ప్లాట్ ఫాం, బోగీల్లో అందిచండ లేదని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. వెజ్ నుంచి నాన్ వెజ్ వరకు అన్ని ఆహార పదార్థాలను నిర్దేశించిన పరిమాణంలో కాకుండా తక్కువగా అందిస్తున్నారు.
నియంత్రణ కరువు ..
రైల్వే స్టేషన్లలోని ప్లాట్ ఫాంలు, రైలు బోగీలలో ఆహార పదార్థాలను అధిక రేట్లకు అమ్ముతున్నా రైల్వే అధికారులు నియంత్రించడం లేదని తెలుస్తోంది. గతంలో పలుమార్లు ఆహారం పదార్థాల ను అధిక ధరలకు విక్రయిస్తున్నారని పలువురు ప్రయాణీకులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదనే విమర్శలు న్నాయి. రైల్వే ప్లాట్ ఫాంలు, బోగీల్లో ఐఆర్టీసీ వెండర్లు కాకుండా ప్రైవేటు వ్యక్తులుసైతం నాణ్యత లేని, కల్తీ ఆహార పదార్థాలను బహిరంగంగా అమ్ముతు న్నా వారిని అదుపు చేయడం లేదనే ఆరోపణలున్నాయి. లైసెన్స్డ్ ఫుడ్ కాంట్రాక్టర్లతో పాటు ప్రైవేటు ఫుడ్ వెండర్లు రైళ్లల్లో ఇష్టా రాజ్యంగా ప్రయా ణికులను దోచుకుంటున్నా అధికారులు తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.