ద్విచక్ర వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
-ఎండాకాలంలో వాహనాల ఇంజిన్ ఆయిల్ త్వరగా వేడెక్కుతుంది. అందుకే సరైన సమయంలో ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాలి.
-బయటికి వెళితే వాహనాన్ని నీడలో పార్క్ చేసుకోవాలి.
-బైక్ పెట్రోల్ ట్యాంకుపై కవర్ ఉండేలా చూసుకోవాలి. టైర్లు అరిగిపోతే మార్చుకోవాలి.
-ఎండాకాలం ఇంజిన్ గార్డు తొలగించడం మంచిది. దూర ప్రయాణమైతే బస్సుల్లోనే వెళ్లాలి. ఒకవేళ వాహనం తీయాల్సి వస్తే.. మధ్య మధ్యలో ఆగడం మంచిది. ఇలా చేయడంతో ఇంజిన్ వేడి తగ్గుతుంది.
-వేసవిలో ట్యాంకులో గ్యాస్ ఏర్పడుతుంది. రాత్రిపూట ఒకసారి ట్యాంకు మూత తీసి మళ్లీ పెట్టాలి. దీంతో గ్యాస్ బయటికి పోయి ఆయిల్ సులువుగా ఇంజిన్లోకి వెళ్తుంది.
మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేయవద్దు. ఉదయం 8 గంటలకు ముందు, సాయంత్రం 6 గంటల తర్వాత పెట్రోల్ పోయించుకోవాలి.
-ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. బైక్లకు ఫుల్ ట్యాంక్ చేయించడం వల్ల పేలిపోయే ప్రమాదం ఉంది. రెండు లీటర్లు పెట్రోల్ వరకు వేయించుకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉండదు. ఒక వేళ బైక్ ఎండలో పెట్టాల్సిన అవసరం ఏర్పడితే ఏదైనా పొడవాటి క్లాత్ను ట్యాంక్ పై కప్పి ఉంచితే సరిపోతుంది. లేదంటే ఎండలకు ఆయిల్ ట్యాంకర్ హీటెక్కి పేలిపోయే ప్రమాదం ఉంది.
పెద్ద వాహనాలకు ఇలా..
-కార్లు, లారీలు ఇతర భారీ వాహనాల విషయంలో రేడియేటర్లలో నీళ్లను తరచూ తనిఖీ చేసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే ఇంజిన్ ఫ్రీజ్ అయ్యే ప్రమాదం ఉంది.
రేడియేటర్లలో నీళ్లకంటే కూలెంట్ ఆయిల్ వాడడం మంచిది. వేడికి ఇంజిన్ ఆయిల్ తగ్గే అవకాశాలు ఉంటాయి. తప్పనిసరిగా ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి.
-పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎల్పీజీ గ్యాస్ ద్వారా వాహనాలు నడిపేవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అటు వంటి వాహనదారులు వేసవిలో గ్యాస్ కిట్ ఉపయోగించకుండా ఉంటే ఉత్తమం.
-ఏసీ నిలబడాలంటే కారు అద్దాలకు క్లాత్ మ్యాట్స్ ఏర్పాటు చేసుకోవాలి.
ఎండాకాలం పూర్తయ్యే వరకు భారీ వాహనాలకు నూతన టైర్లు వాడితే మేలు. లేదంటే దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో పాత టైర్లలో గాలి తగ్గిపోయి పేలిపోయే ప్రమాదం ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..