Sunday, November 17, 2024

విస్తృతంగా వాహనాల తనిఖీలు.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు..

పెద్దపల్లి, ప్రభన్యూస్ : పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. గురువారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ప్రధాన కోడళ్ళతోపాటు శివారులో వాహనాల తనిఖీలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాల పై కేసులు నమోదు చేశారు. అనంతరం ఏసిపి సారంగపాని మాట్లాడుతూ రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు జరిమానాలు విధిస్తున్నామన్నారు.

వాహనదారులు తప్పనిసరిగా దృవికరనపత్రాలు, లైసెన్సులు, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలన్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకు వెళ్లాల్సి వస్తుంది అన్నారు. తనిఖీల్లో పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్, ఎస్సైలు మహేందర్, మౌనిక, శివాని, రవీందర్ లతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement