పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు, మద్యం, ఇతర వస్తువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం నిఘా పెడుతూ ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టగా.. తనిఖీల్లో రూ.5.73 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చందన దీప్తి వెల్లడించారు.
సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో మిర్యాలగూడ టౌన్ నుంచి కోదాడ వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా.. వాహనంలో రూ.5.73కోట్ల బంగారాన్ని గుర్తించినట్టు తెలిపారు. బంగారం, వ్యాన్‌తో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఎస్పీ వివరించారు.