Thursday, November 21, 2024

మహిళా జర్నలిస్టుకు కేరళ కేబినెట్‌లో చోటు.. ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు

మే 20న కేరళలో నూతన కేబినెట్ కొలువు దీరనుంది. ఈ మేరకు మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్న 11 మంది పేర్లను మంగళవారమే పినరయి విజయన్ ప్రకటించారు. అయితే ఈనెల 20న కొలువుదీరే కేరళ కేబినెట్‌లో ఆరోగ్యశాఖ మంత్రిగా కొత్త ముఖం తెరపైకి వచ్చింది. పలు మలయాళ ఛానెళ్లలో జర్నలిస్ట్, న్యూస్ యాంకర్‌గా పనిచేసిన మహిళా ఎమ్మెల్యే వీణ జార్జ్‌ ఈ స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో కేకే శైలజ ఆరోగ్యశాఖ మంత్రిగా సేవలందించిన సంగతి తెలిసిందే. ఆమె స్థానాన్ని వీణ జార్జ్ భర్తీ చేయనున్నారు. ఆమె 2016 ఎన్నికల్లో పతనంతిట్ట జిల్లాలోని అరన్ముల అసెంబ్లీ నుంచి గెలుపొందారు. ఈ ఏడాది రెండోసారి మళ్లీ ఎన్నికయ్యారు. గతంలో జాతీయ సామాజిక ఆదర్శ యువ ఎమ్మెల్యే అవార్డును వీణా జార్జ్ సొంతం చేసుకోవడం విశేషం. ఆరోగ్య శాఖమంత్రిగా మరోవైపు ప్రస్తుత ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజను పార్టీ విప్‌గా నియ‌మించనున్నారు. కాగా తిరువనంతపురం సెంట్రల్‌ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement