Thursday, November 21, 2024

వేదాంత‌…. మ‌రో అదాని?

న్యూఢిల్లి: వేదంతా గ్రూప్‌ రుణాల ఊబిలో కూరుకుపోయింది. గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ ఇందులోంచి బయటపడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అదానీ ఉదంతం మరవక ముందే స్టాక్‌మార్కెట్‌లో ఇన్వెస్టర్లను మరో సునామి చుట్టుముట్టే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేదాంత అనుబంధ కంపెనీకి అంతర్జాతీయంగా ఉన్న గనుల ఆస్తులను హిందూస్థాన్‌ జింక్‌కు విక్రయించాలని వేదంతా ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ చేసిన ప్రయ త్నాలను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంది. హిందూస్థాన్‌ జింక్‌లో కేంద్రా నికి 30 శాతం వాటా ఉంది. వేదంతా రిసోర్స్‌ లిమిటెడ్‌లో వాటాను (గనులు) అగర్వాల్‌ అమ్మేందుకు ప్రయత్నించారు. దీన్ని హిందూ స్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌కు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది.


వేదాంతకు పెరిగిపోతున్న రుణాలను చెల్లించేందుకు తక్షణమే 2 బిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించుకోవాల్సి ఉంటుందిని గ్లోబల్‌ రేటింగ్‌ సంస్థ ఎస్‌ అండ్‌ పీ హెచ్చరించింది. లేకుంటే కంపెనీ డెబిట్‌ స్కోర్‌పై ఒత్తిడి పెరుగుతుందని తెలిపింది. దీన్ని ంచి బయట పడేందుకే జింక్‌ యసెట్స్‌ను విక్రయించేందుకు వేదంతా ప్రయత్నించింది. హిందూస్థాన్‌ జింక్‌ జనవరిలో మారిషస్‌కు చెందిన టీహెచ్‌ఎల్‌ జింక్‌ లిమిటెడ్‌కు ఉన్న ఆస్తులను కొనుగోలు చేయాడానికి అం గీకరించింది. ఇందుకు 18 నెలల్లో దశల వారిగా 2.98 బిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ డీల్‌ సమయం లోనే కేంద్ర ప్రభుత్వం దీన్ని వ్యతి రేకిస్తున్నట్లు తెలిపింది. హిందూస్థా న్‌ జింక్‌ లిమిటెడ్‌ బోర్డులో ఉన్న ప్రభు త్వ ప్రతినిధులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. కంపెనీ ఈ ప్లాన్‌తో ముందుకు వెళ్తే లీగల్‌ యాక్షన్‌ తీసుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తామని హెచ్చిరిం చింది. ఈ లేఖ కాపీని ప్ర భుత్వం స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కు పంపించింది. కంపెనీ కూడా ప్రత్యేక ఫైలింగ్‌లో ఈ ఒప్పం దాన్ని ఆమోదించడానికి ఇంకా వాటాదారుల సమావేశాన్ని నిర్వహించలేదని తెలిపింది. హిం దూస్థాన్‌ జింక్‌ మొత్తం పెట్టుబడులు, క్యాష్‌, క్యాష్‌
ఈక్వలెంట్స్‌ 21 శాతం తగ్గి 164.82 బిలియన్‌ రూపాయలుగా ఉన్నాయి.

కంపెనీకి వచ్చే మూడున్న సంవత్స రాల్లో 4.7 బిలియన్‌ డాలర్ల విలువై న బాండ్లు ఉన్నాయి. కంపెనీ ఆర్ధిక పరిస్థితి కూడా సరిగా లేనందున వేదాంత రిసోర్సెస్‌లో వాటా కొనుగోలు భారంగా మారు తుందని ప్రభుత్వం భావిస్తోం ది. వేదాంత రిసోర్సెస్‌ ఇప్ప టికే భారత్‌ బ్యాంక్‌ల నుంచి భారీగా రుణాలు తీసుకుంది. రీఫైనాన్సింగ్‌ కోసం ప్రభుత్వ బ్యాంక్‌లపై ఆధారపడుతోంది. 3.5 బిలియన్‌ డాలర్ల నగదు సర్దుబాటు చేసిన తరువాత వేదాంత గ్రూప్‌ నికర రుణాలు 11.8 బిలియన్‌ డాలర్లుగా ఉన్నా యి. రీ ఫైనాన్సింగ్‌ ప్రక్రియలో రానున్న రోజుల్లో మంజురైన మొ త్తాల విడుదల చేయడం ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌ వైఖరిపై ఆధారపడి ఉంది. ఈ గ్రూప్‌కు రుణాలు ఇచ్చిన ప్రైవేట్‌ బ్యాంక్‌లో యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాం క్‌లు ఉన్నాయి. వేదాంత గ్రూప్‌ స్థూల రుణం మొత్తం 15.3 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇందులో మన దేశానికి చెందిన బ్యాంక్‌లు రూపీ లోన్‌గా 6.73 బిలియన్‌ డాలర్ల రుణాలను ఇచ్చాయి. రుణాల్లో 8.57 బిలియన్‌ డాలర్ల వేర విదేశీ కరెన్సీ రుణాలు ఉన్నాయి. వేదాంత వచ్చే మూడు సంవత్సరాల్లో రు ణాలను చెల్లించే ప్రణాళి కను ప్రకటించింది. 13.9 బిలి యన్‌ డాలర్ల దీర్ఘకాలిక రుణాల్లో 2022-23 సగం నాటికి 1.2 బిలియన్‌ డాలర్లు, 2023-24 నాటికి 4.1 బిలి యన్‌ డాలర్లు, 20 24-25 నాటికి 3.9 బిలియన్‌ డాల ర్లు, 2025-26 నాటికి 4.7 బిలియన్‌ డాలర్లు చెల్లిస్తా మని తెలిపింది. మొత్తం వేదాంత గ్రూప్‌ రుణాలను రెండు భాగాలుగా విభజించారు. హోల్డింగ్‌ కంపెనీ, లండన్‌కు చెందిన వేదాంత రిసోర్సె స్‌ కంపెనీకి చెందినవి. వేదా ంత ప్రకృతి వనరుల వ్యాపా రంలో ఉంది. భారత్‌తో పా టు, పలు దేశాల్లో జింక్‌, అల్యూ మినియ గనులు కలిగి ఉంది. స్థూ లంగా 8 బిలియన్‌ డాలర్లు వేదాంత రిసోర్సెస్‌, ఇండియాలో ఉన్న వేదాంత లిమిటెడ్‌కు 7 బిలియన్‌ డాలర్ల రుణాలు ఉన్నాయి.
2021-22లో వేదాంత మొత్తం ఆదా యం 1,35,332 కోట్లుగా నమోదైంది. నికర లాభం 23, 710 కోట్లుగా ఉంది. అదానీ గ్రూప్‌ వైఫల్యం తెరపైకి వచ్చి న తరువాత ఇప్పుడు వేదాంతలో జరిగుతున్న పరిణా మాలు మార్కె ట్‌ వర్గాల్లో ఆందోళన కల్గిస్తు న్నాయి. లండన్‌ కేంద్రంగా కార్య కలాపాలు నిర్వహిస్తున్న వేదంతా గ్రూప్‌ డిసెంబర్‌ 31, 2023 నాటికి 500 మిలియన్‌ డాలర్ల రుణాలు చెల్లించాల్సి ఉంది. 2024 జన వరి నాటికి 1 బిలియన్‌ డాలర్ల మేర బాండ్స్‌ చెల్లించాల్సి ఉంది. గ్రూప్‌ రుణ భారం అత్యధికంగా ఉండటం తోనే మా ర్కెట్‌ నిపు ణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేదాంత గ్రూప్‌ నికర విలువ 13.23 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ విలువను మించి రుణాలు ఉన్నాయి. రుణాలు ఇచ్చిన వాటిలో అత్యధిక వాటా ప్రభుత్వ బ్యాంక్‌లదే. అందుకే వేదాంత చిక్కు ల్లో పడితో రిటైల్‌ ఇన్వెస్టర్లతో పాటు, ప్రభుత్వ బ్యాంక్‌లు సైతం ఆర్ధికంగా భారీగా నష్టపోవడం ఖాయమని మార్కెట్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆందోళన తోనే వేదంతా గ్రూప్‌ షేర్లు వరసగా 8 సెషన్లలో నష్టాల్లోనే ముగి స్తున్నాయి. ఫిబ్రవరి 28న వేదా ంత షేర్లు 9 శాతం నష్టపోయాయి. 2022, సెప్టెంబర్‌ 16 తరువాత వేదం తా షేర్లు ఇంతలా పతనం కావడం ఇదే మొదటిసారి. కూడా కంపెనీ షేరు అత్యధికంగా 8.82 శాతం నష్టపోయింది. కంపెనీ రుణ భారాన్ని 11.8 బిలియన్‌ డాలర్ల నుంచి 7.7 బిలియన్‌ డాలర్లకు తగ్గించుకున్నట్లు ప్రకటించింది.అయితే కంపెనీ మార్కెట్‌ విలువకు, రుణాల నిష్పత్తితో చూస్తే ఇది సరిపోదని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement