అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ నిర్మించిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. బన్నీ వాసు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా గతవారం విడు దలైంది. కిరణ్ అబ్బవరం హీరోగా, కశ్మీర పర్ధేశీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం థియేటర్లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా తో మాట్లాడింది.
నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ ”ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. కొత్త వారి మీద చాలా ఎక్కువగా ఖర్చు పెట్టారా? అని అంతా అడుగుతున్నారు. అర వింద్ గారి వద్ద ఉన్న క్రమశిక్షణ వల్లే ఖర్చు హద్దుల్లోనే ఉండగలిగింది. అదే మా టీ-ం సక్సెస్ సీక్రెట్. ఈ సినిమాను మా దర్శకుడు తీర్చిదిద్దిన విధానం చూసి ముచ్చ టేసింది. సినిమాలోని ట్విస్టులు, కథ, నిడివి విషయంలో చాలా మంది చాలా రకా లుగా మాట్లాడారు. కానీ నేను మాత్రం సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాను. కిరణ్ అబ్బవరం మాకు ఎంతో సహకరించారు. మా ప్రతీ మాటను అర్థం చేసుకున్నారు. కిరణ్ ఎంతో హంబుల్‌గా ఉంటారు.” అన్నారు.
నిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ ”ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. ఇలాంటి కథలను చిన్న స్క్రీన్ మీద, ఓటీ-టీ-ల్లో చూడటం కంటే.. థియేట ర్లో చూసినప్పుడు వచ్చే మజా వేరేలా ఉంటు-ంది.” అని అన్నారు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ఇండస్ట్రీ ప్రముఖులందరూ కూడా సినిమాను చూసి మెచ్చుకున్నారు. ఆడియెన్స్ నుంచి మంచి స్పందనే వస్తోంది. ఈ సినిమాను ఫ్యామిలీ అంతా కలిసి చూడాలి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందనే మాట నుంచి ఈ సినిమా మొదలవుతుంది. అని అన్నారు. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు మాట్లాడుతూ ”ఇది కేవలం నంబర్ నైబర్ కాన్సెప్ట్ కోసం తీసింది కాదు. అమ్మ సెంటిమెంట్ ఉంటు-ంది. ఆడపిల్ల కంట్లో నీళ్లు వస్తే విష్ణు ఏం చేస్తారో చెప్పే కథ ఇది. మంచి అనేది వ్యాప్తి చెందడానికి -టైం పడుతుంది. కానీ అది స్టార్ట్ అయితే ఆగదు. ఆ డైలాగ్ మాకు సరిగ్గా సరి పోద్ది” అని అన్నా రు. హీరోయిన్ కశ్మీ ర పర్ధేశీ, సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ కూడా మాట్లాడారు.