రాజస్థాన్ బీజేపీలో సీన్ మారుతున్నది. పార్టీ సీనియర్ నాయకురాలు వసుంధర రాజే సింధియా ప్రాధాన్యం తగ్గిపోతున్నట్లు కనిపిస్తున్నది. వచ్చే సంవత్సరం జరుగనున్న అసెంబ్లి ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోడీనే ప్రధాన ఆకర్షణగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు సతీశ్ పూనియా శనివారం తెలియజేశారు. కొన్ని సార్లు కొందరి ముఖాలు ప్రముఖంగా కనిపిస్తాయి. రానున్న అసెంబ్లి ఎన్నికలలో బీజేపీ మోడీ సారథ్యంలోనే పోటీ చేస్తుంది. 2017లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలలో యోగీ ఆదిత్యనాథ్‌ను ముందు పెట్టలేదు.
మోడీ నాయకత్వంలోనే పార్టీ అక్కడ ఎన్నికల సమరంలో పాల్గొన్నది. అయినా.. విజయం సాధించింది అని పూనియా అభిప్రాయపడ్డారు. జైపూర్‌లో జరుగుతున్న పార్టీ వ్యూహాల ఖరారు సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ సమావేశం జరుగనున్నది. పూనియా చేసిన వ్యాఖ్యలు రాజే ప్రాధాన్యం తగ్గిపోతున్నదన్న భావాన్ని ధ్రువపరుస్తున్నది. నిజానికి రాష్ట్రంలో జనాకర్షణ కలిగిన ఏకైక నేత వసుంధర రాజేనే. అయితే, ఈ ఎన్నికలలో వసుంధర రాజే కీలక పాత్ర పోషిస్తారనీ, ఎన్నికల ర్యాలీలలో ఆమె తనతో పాటు వేదికను పంచుకుంటారని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించిన మరునాడే పూనియా ఈ ప్రకటన చేయడం గమనార్హం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..