Tuesday, November 19, 2024

Varun – Lavanya | వ‌రుణ్ లావ‌ణ్య‌ల పెళ్లి కార్డ్ అదుర్స్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. పెళ్లి పీఠలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. కొన్ని సంవత్సరాలుగా ప్రేమిస్తోన్న హీరోయిన్‌ లావణ్య త్రిపాఠిని పెద్దల సమక్షంలో పెళ్లిచేసుకోబోతున్నాడు వరుణ్ తేజ్. నవంబర్ 1న ఈ సెలెబ్రిటి జంట ఇటలీలో పెళ్లి చేసుకోనుంది. ఇక దీంతో మెగా ఫ్యామీలీలో ఆల్రెడీ పెళ్లి సంద‌డి మెద‌లైంది. ప్ర‌స్తుతం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జ‌రుగుతుండ‌గా.. వీరికి సంబంధించిన పెళ్లి కార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సిల్వర్ కలర్‌లో ఉన్న ఈ పెళ్లి కార్డ్‌లో మొదట వరుణ్ తాత, నాన్నమ్మల పేర్లను ముద్రించారు. ఆ తరువాత‌ వరుణ్ పెదనాన్న చిరంజీవి పేరు, బాబాయి పవన్ కళ్యాణ్ పేరు, చివరగా వాళ్ల అన్నయ్య రామ్ చరణ్ పేర్లను ముద్రించారు. ఈ పేర్లతో పాటు వరుణ్ తల్లిదండ్రుల పేర్లు నాగబాబు, పద్మజ, లావణ్య తల్లిదండ్రులు కిరణ్, దియోరాజ్ త్రిపాఠి పేర్లను ముద్రించారు.

అక్టోబర్ 30 నుంచి ఈ పెళ్లి వేడుక మొదలు కాబోతుంది. నవంబర్ 1న ఇటలీలోని టుస్కానీ నగరంలో వరుణ్, లావణ్య కుటుంబసభ్యుల మధ్యన మాత్రమే ఈ వివాహం జరగనుంది. ఆ తరువాత నవంబర్ 5న హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ హాల్ లో రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు సినీ సెలబ్రిటీస్ తో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరుకానున్నారని సమాచారం. ఇక ఇటలీలో జరగబోయే పెళ్లి కోసం మెగా ఫ్యామిలీ మొత్తం రేపు అక్టోబర్ 27న బయలుదేరనున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement