Friday, November 22, 2024

Cocktail Party – వ‌రుణ్ – లావ‌ణ్యాల వివాహ వేడుక‌లు…బంధు, మిత్రుల‌కు ప‌సందైన మందు విందు

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠిలు మరో 24 గంటల్లో వివాహ బంధంతో ఒక్కటవుతారు. ఈ క్రమంలో ఇప్పటికే ఇటలీ చేరుకున్న ఈ జంట ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్​తో బిజీబిజీగా ఉంది. మరోవైపు వీరి వివాహానికి హాజరయ్యేందుకు ఇప్పటికే మెగా, అల్లు ఫ్యామిలీస్.. ఇతర బంధువులు, స్నేహితులు ఇటలీకి చేరుకున్నారు. ఇటలీలో జరగనున్న వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ మూడ్రోజుల పాటు ఘనంగా సాగనుంది

. ఇందులో భాగంగా అక్టోబర్ 30 రాత్రి.. కాక్‌టెయిల్స్ పార్టీతో వీరి వెడ్డింగ్ ఈవెంట్స్ షురూ అయ్యాయి. ఈ పార్టీకి మెగా, అల్లు ఫ్యామిలీ హీరోస్ అల్ట్రా పోష్ లుక్​లో వచ్చారు. రామ్ చరణ్-ఉపాసన దంపతులు, అల్లు అర్జున్-స్నేహ దంపతులు క్రీమ్ అండ్ బ్లాక్ వెస్టర్న్ ఔట్ ఫిట్స్​లో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో వరుణ్​, లావణ్య వైట్ కలర్ డ్రెస్​లో మెరిసిపోయారు

ఇక ఈరోజు హల్దీ, మెహందీ ఫంక్షన్స్ జరగనున్నాయి. వరుణ్‌, లావణ్యతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఈ ఫంక్షన్‌లో పాల్గొంటారు. ఇక నవంబర్ 1వ తేదీ ఈ జంట వివాహబంధంతో ఒక్కటవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement